NTV Telugu Site icon

TVS Apache RTR 160: మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్..బుకింగ్స్ షురూ..

Tvs Apache Rtr 160

Tvs Apache Rtr 160

టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) అపాచీ వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపును కూడగట్టుకుంది. దీని డిమాండ్ తగ్గడం లేదు. ఈ కారణంగా కంపెనీ ఇప్పుడు కస్టమర్ల కోసం ఈ బైక్‌కు సంబంధించిన ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ పేరు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 (TVS Apache RTR 160) రేసింగ్ ఎడిషన్. ఈ కొత్త ఎడిషన్ లో కంపెనీ అందించిన ప్రత్యేకతలు.. ధర తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రే గ్రాఫిక్స్, రేసింగ్ రెడ్ స్ట్రిప్‌తో ప్రత్యేకమైన బ్లాక్ కలర్ స్కీమ్‌తో రేసింగ్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ రెసిండే ఎడిషన్ మోడల్ ధర రూ. 1,28,270 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్ల వద్ద ఈ బైక్ బుకింగ్ ప్రారంభమైంది.

READ MORE: Bhatti Vikramarka: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు

ఈ రేసింగ్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే…
టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ బైక్‌లో.. TVS SmartXonnect ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే ఎల్ సీడీ (LCD) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అమర్చారు. ఇందులో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను పొందుతారు. అవి స్పోర్ట్, అర్బన్, రెయిన్. బైక్‌కు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్ చేయబడిన ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చారు. బ్రేకింగ్ వేరియంట్ ఆధారంగా 270ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ 200ఎమ్ఎమ్ డిస్క్/130ఎమ్ఎమ్ డ్రమ్ ద్వారా అందిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

READ MORE: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి

ఈ మోటార్‌సైకిల్ 159.7సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది. 16.04పీఎస్ గరిష్ట శక్తిని 13.85ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. డబుల్ క్రెడిల్ సింక్రొనైజ్డ్ స్టిఫ్ ఛాసిస్ ఆధారంగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 5-దశల ఎడ్జెస్ట్ చేయగల షాక్‌లను కలిగి ఉంది.