NTV Telugu Site icon

TVS Apache RTR 160 4V: కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ రిలీజ్.. ధర ఎంతంటే..?

Tvs Appache

Tvs Appache

టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలో.. కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V ముందుకొస్తుంది. ఈ బైక్ గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్‌తో అమర్చారు. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది. అంతేకాకుండా.. బ్లూటూత్ కనెక్టివిటీని అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS వార్నింగ్, వాయిస్ సహాయాన్ని అందిస్తుంది. ఈ బైకులో గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) కూడా ఉంది.

Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..

బైక్ కలర్స్:
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 1604V మూడు వేర్వేరు కలర్లలో అందుబాటులో ఉంటుంది. అందులో గ్రానైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి రంగులు ఉన్నాయి. ఇంతకు ముందు లైట్నింగ్ బ్లూ ఉండేది. ఈ బైక్ స్పోర్టీ, రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, గోల్డెన్-ఫినిష్ USD ఫోర్క్స్, రెడ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్:
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V బైక్ 160 cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 17.3 bhp శక్తిని, 6,500 rpm వద్ద 14.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 114 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. రైడ్ మోడ్‌ల గురించి మాట్లాడుతూ.. అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో స్పోర్ట్, అర్బన్, రెయిన్ సహా మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.

సస్పెన్షన్, బ్రేకింగ్:
ఈ బైకుకు 37mm USD ఫ్రంట్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABS, 240 mm వెనుక డిస్క్ బ్రేకింగ్ కలిగి ఉంది.

ధర:
అపాచీ ఆర్టీఆర్ 160 4V ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 లక్షలు. ఈ బైక్ బజాజ్ పల్సర్ N160, హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V వంటి బైకులకు పోటీగా నిలుస్తుంది.

Show comments