350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triumph Bonneville T40 Launched: ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ (Triumph) భారత్‌లో తన 350cc బైక్ లైనప్‌ను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగా కొత్త Bonneville T40ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. క్లాసిక్ బొన్నెవిల్లే డిజైన్‌తో వచ్చిన ఈ రెట్రో రోడ్‌స్టర్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కొత్త బైక్ లో 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,000rpm వద్ద 29hp పవర్, 5,500rpm వద్ద 31.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇతర 350cc ట్రయంఫ్ మోడళ్లతో పోలిస్తే T40లో టార్క్ ఆధారిత, సులభమైన రైడింగ్ అనుభూతిని అందించేలా ఇంజిన్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. సిలిండర్ హెడ్‌ను రివైజ్ చేయడంతో పాటు ప్రత్యేక క్యామ్షాఫ్ట్లు, చిన్న వ్యాసం కలిగిన థ్రాటిల్ బాడీలు, కొత్త పీషూటర్ స్టైల్ ఎగ్జాస్ట్‌ను అందించారు. అలాగే ఇతర మోడళ్లతో పోలిస్తే పొడవైన గేరింగ్‌ను ఉపయోగించారు.
Also Read
- అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
- Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
- Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
- New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
T40లోని ఛాసిస్ దీని ప్రత్యేకతల్లో ఒకటి. ముందు భాగంలో స్పీడ్, స్క్రామ్బ్లర్ మోడళ్లతో పోలిన ఆర్కిటెక్చర్ ఉన్నప్పటికీ, వెనుక భాగాన్ని పూర్తిగా కొత్తగా రూపొందించారు. క్లాసిక్ బొన్నెవిల్లే లుక్ కోసం ట్విన్ షాక్ అబ్జార్బర్లు, ట్యూబ్యులర్ స్టీల్ స్వింగార్మ్‌ను ఇందులో ఉపయోగించారు. సబ్‌ఫ్రేమ్‌ను ఇతర మోడళ్ల మాదిరిగా బోల్ట్ చేయకుండా ప్రధాన ఫ్రేమ్‌కు వెల్డ్ చేశారు. ముందు భాగంలో 43mm గైటర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండింటిలోనూ 130mm ట్రావెల్ లభిస్తుంది.
బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 310mm డిస్క్‌తో ట్విన్ పిస్టన్ యాక్సియల్ కాలిపర్, వెనుక 255mm డిస్క్‌తో సింగిల్ పిస్టన్ కాలిపర్‌ను అందించారు. లీన్-సెన్సిటివ్ ABS కూడా ఉంది. వైర్-స్పోక్ వీల్స్‌కు ముందు 100/90-18, వెనుక 150/70-R18 సైజ్ MRF ట్యూబ్డ్ టైర్లను అమర్చారు. పంక్చర్ సమయంలో ఉపయోగపడేలా సెంటర్ స్టాండ్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఈ కొత్త Bonneville T40 బరువు 195 కిలోలు. దీంతో బజాజ్ తయారు చేసే ట్రయంఫ్ 350cc మోడళ్లలో ఇదే అత్యంత బరువైన బైక్‌గా నిలిచింది. ఇందులో 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.
సీటు ఎత్తు 790mmగా ఉంది. యాక్సెసరీ లో సీట్‌ను ఉపయోగిస్తే దీన్ని 770mmకు తగ్గించుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 165mmగా ఉండటంతో భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది. క్లాసిక్ డిజైన్ ఉన్నప్పటికీ ఫీచర్ల విషయంలో T40 ఆధునికంగా ఉంది. ఇందులో కొత్త 4 అంగుళాల రౌండ్ కలర్ TFT డిస్ప్లేను అందించారు. రైడింగ్ మోడ్లు, ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం ఐదు రైడింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోడ్, రైన్, ఎకో తో పాటు రెండు కస్టమైజ్ చేసుకునే మోడ్లు ఉన్నాయి. ‘హెరిటేజ్’ మోడ్‌ను ఎంచుకుంటే డిస్ప్లే లేఅవుట్ పాతకాలపు స్టైల్లోకి మారుతుంది. స్మార్ట్‌ఫోన్‌ను ‘ట్రయంఫ్ నావిగేషన్’ యాప్ ద్వారా బైక్‌కు కనెక్ట్ చేస్తే డిస్ప్లేపై నావిగేషన్‌ను కూడా చూసుకోవచ్చు. Triumph Bonneville T40 ధర రూ.2.80 లక్షలు (ఎక్స్-షోరూమ్).
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!