Site icon NTV Telugu

Top 5 Best-Selling Cars: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే!

Top 5 Cars

Top 5 Cars

Top 5 Best-Selling Cars: నవంబర్ 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో కారు అమ్మకాలు జోరు పెరిగింది. కాంపాక్ట్ ఎస్యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ లభించింది. ఈ క్రమంలో టాటా నెక్సాన్, మారుతి సుజుకి డిజైర్, స్విఫ్ట్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా కార్లు ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్–5 మోడల్స్ గా నిలిచాయి.

Read Also: Sydney Terror Attack: నా కొడుకులాంటివాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

అయితే, ఈ జాబితాలో టాటా నెక్సాన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 2025లో ఈ కాంపాక్ట్ SUV 22,434 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండటం వల్ల నెక్సాన్‌కు అన్ని విభాగాల వినియోగదారుల నుంచి డిమాండ్ వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో టాటా నెక్సాన్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

ఇక, రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ నవంబర్‌లో 21,082 యూనిట్లు విక్రయం అయ్యాయి. సెడాన్ సెగ్మెంట్‌లో స్థిరమైన విశ్వాసాన్ని పొందిన డిజైర్, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వార్షిక వృద్ధిని సాధించింది. అలాగే, మూడో స్థానాన్ని మారుతి సుజుకి స్విఫ్ట్ దక్కించుకుంది. ఈ నవంబర్ లో హ్యాచ్‌బ్యాక్ 19,733 యూనిట్ల అమ్మకాలతో మరోసారి సత్తా చాటుకుంది. సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో స్విఫ్ట్ ఒకటిగా కొనసాగుతోంది.

Read Also: Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

అలాగే, నాలుగో స్థానంలో టాటా పంచ్ కొనసాగుతుంది. ఈ కాంపాక్ట్ SUV నవంబర్‌లో 18,753 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆకర్షణీయమైన డిజైన్, చిన్న SUV స్థానం కారణంగా పంచ్‌ కార్లకు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఇక, టాప్–5 జాబితాలో ఐదో స్థానాన్ని హ్యుందాయ్ క్రెటా దక్కించుకుంది. నవంబర్ లో ఈ మిడ్-సైజ్ SUV 17,344 యూనిట్లు విక్రయం అయ్యాయి. తీవ్ర పోటీ ఉన్న సెగ్మెంట్‌లోనూ క్రెటా తన స్థిరమైన అమ్మకాలతో ముందంజలో కొనసాగుతోంది. అయితే, నవంబర్ 2025లో మొత్తంగా భారత కార్ల మార్కెట్‌లో ఎస్యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లకు సమానమైన ఆదరణ లభించిందని ఈ అమ్మకాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Exit mobile version