Tesla India: టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించి అధికారికంగా భారత్‌లోకి ప్రవేశించింది. తాజాగా ఎలోన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. గతంలో లంబోర్గిని ఇండియాకు నాయకత్వం వహించిన శరద్ అగర్వాల్‌ను భారత్‌కి కొత్త దేశ అధిపతిగా కంపెనీ నియమించింది. ఈ నిర్ణయం టెస్లా వ్యూహంలో ఒక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు. కస్టమర్ల నాడిని పట్టుకోవడానికి కంపెనీ
ప్రయత్నిస్తోంది.
READ MORE: Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో టెస్లా కార్యకలాపాలకు శరద్ అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. శరద్ అగర్వాల్ నియామకం కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరిస్తుందనే ఆశలను రేకెత్తించింది. శరద్ అగర్వాల్ భారత ఆటో పరిశ్రమలోని లగ్జరీ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉన్నారు. జావా, యెజ్డి, బీఎస్ఎ వంటి మోటార్ సైకిళ్ల తయారీదారు క్లాసిక్ లెజెండ్స్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. గతంలో ఆయన భారతదేశంలో లగ్జరీ స్పోర్ట్స్ కార్ కంపెనీ లంబోర్గినికి నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వం వహించినప్పుడు కంపెనీ రికార్డు అమ్మకాలను సాధించింది. బ్రాండ్ ప్రీమియం ఇమేజ్ సైతం బలోపేతం చేశారు. ఇప్పుడు టెస్లా అమ్మకాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఆయన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు.
READ MORE: Temple Dwajasthambam: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ప్రాముఖ్యత ఏంటంటే..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి సెప్టెంబర్ వరకు తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇది కంపెనీ నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యాల కన్నా చాలా తక్కువగా ఉంది. టెస్లా తన వార్షిక కోటాలో 2500 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక తెలిపింది. టెస్లా ప్రస్తుతం 2025లో భారతదేశానికి 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని చూస్తోంది. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో చైనా షాంఘై ప్లాంట్ నుంచి వస్తుంది. ప్రారంభ డెలవరీలు ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్‌లకు పరిమితం చేయబడుతాయి.
