Tata Winger Plus: టాటా మోటార్స్ తాజాగా 9 సీటర్ మోడల్ టాటా వింగర్ ప్లస్ (Tata Winger Plus)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాహనం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, విశాలమైన, ఆధునిక కనెక్టివిటీతో కూడిన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాహనం ముఖ్యంగా వాహన రంగంలో ఉండే యజమానులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్ భారీ ట్విస్ట్
ఇక ఈ వింగర్ ప్లస్‌లో రెక్లైనింగ్ కెప్టెన్ సీట్లు, అడ్జస్టబుల్ ఆర్మ్రెస్టులు, వ్యక్తిగత USB చార్జింగ్ పాయింట్లు, వ్యక్తిగత AC వెంట్స్, కాస్త విశాలంగా ఉండే లెగ్ స్పేస్ వంటి విభాగంలోనే మంచి ఫీచర్లు అందించారు. విశాలమైన క్యాబిన్, పెద్ద లగేజీ స్పేస్ వల్ల సుదూర ప్రయాణాలు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. మోనోకాక్ ఛాసిస్‌పై నిర్మితమైన ఈ వ్యాన్ ప్రయాణంలో మంచి భద్రతా ప్రమాణాలు, స్టెబిలిటీ కల్పిస్తుంది. కార్ల తరహా డ్రైవింగ్ అనుభవం, సులభమైన హ్యాండ్లింగ్ కారణంగా డ్రైవర్లకు అలసట తక్కువగా ఉంటుంది.
RIL Jio Frames: HD కెమెరా, లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్లతో రిలయన్స్ జియోఫ్రేమ్స్
కొత్త వింగర్ ప్లస్‌లో 2.2L Dicor డీజిల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 100hp పవర్, 200Nm టార్క్ ఇస్తుంది. అంతేకాకుండా టాటా మోటార్స్ Fleet Edge కనెక్టెడ్ వెహికిల్ ప్లాట్‌ఫారమ్‌తో వస్తుంది. దీని ద్వారా రియల్-టైమ్ ట్రాకింగ్, డయాగ్నస్టిక్స్, ఫ్లీట్ ఆప్టిమైజేషన్ సాధ్యమవుతుంది. ఇక ఈ టాటా వింగర్ ప్లస్ ను రూ.20.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేశారు.