NTV Telugu Site icon

Car Sales In June: జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

Car

Car

జూన్ 2024లో ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 3.40 లక్షల వాహనాలను విక్రయించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 3.67 శాతం పెరిగాయి. జూన్ 2023లో దాదాపు 3.28 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి, కియా, టాటా మోటార్స్ మరియు ఇతర కంపెనీలు ఎన్ని వాహనాలను విక్రయించాయో తెలుసుకుందాం.

READ MORE: IND vs ZIM: అభిషేక్, రుతురాజ్ ఊచకోత.. జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యం

స్వదేశీ తయారీ కంపెనీకి చెందిన టాటా పంచ్ జూన్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో 18,238 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ 16,422 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానానికి చెరుకుంది. హ్యుందాయ్ క్రెటా 16,293 యూనిట్లు విక్రయించబడ్డాయి. మారుతి సుజుకీ ఎర్టిగా -15,902, మారుతీ బాలెనో -14,895, మారుతీ వ్యాగన్ ఆర్ -13,790, మారుతి డిజైర్ -13,490, మహీంద్రా స్కార్పియో-12,307, టాటా నెక్సన్ -12,066 యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయని ఆయా కంపెనీలు తెలిపాయి.

READ MORE: Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర ప్రారంభం..హాజరైన రాష్ట్రపతి..

కాగా.. మారుతీ సుజుకి మే 2024లో ఆటోమొబైల్ అమ్మకాలలో టాప్ ర్యాంక్‌ను తిరిగి పొందింది. ఏప్రిల్ 2024లో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా ఉన్న టాటా పంచ్‌ను జాబితాలో పడగొట్టింది. కానీ ప్రస్తుతం మళ్లీ టాటాపంచ్ అమ్మకాల్లో ముందుకు దూసుకెళ్లింది. జూన్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. దీనికి గల కారణం..టాటా కంపెనీ నాణ్యతాపరంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం. ఆ కార్లలో అరుదైన ఫ్యూచర్లతో పాటు.. తక్కువ ధర ను నిర్ణయించడంతో ప్రజలు టాటావైపు మొగ్గుచూపుతున్నారు.