Site icon NTV Telugu

Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?

Tata Nexon Ev Vs Mg Windsor Ev

Tata Nexon Ev Vs Mg Windsor Ev

దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్‌ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్‌, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్‌కు తమ ఎలక్ట్రిక్‌ కార్లను పరిచయం చేస్తున్నాయి.

READ MORE: Sailesh Kolanu: మా టార్గెట్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది.. అది గూస్‌బంప్స్ మూమెంట్!

ప్రస్తుతం మార్కెట్లో టాటా ఈవీలకు మంచి ఆదరణ ఉంది. టాటా నెక్సాన్ ఈవీకి విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి పోటీగా చైనాకు చెందిన ఎంజీ మోటార్ ఓ కారును లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అదే ఎంజీ విండ్‌సర్ ఈవీ. ఈ రెండు కార్ల మధ్య ధర, ఫీచర్లు, పర్ఫామెన్స్‎లను పోల్చి చూద్దాం. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర రూ .14 లక్షల నుంచి రూ .16 లక్షలు(ఎక్స్-షోరూమ్). కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.12.49 లక్షల నుండి ప్రారంభమై రూ.17.19 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

READ MORE: Viral : అమ్మాయి ప్రేమకు పులి కూడా దాసోహం..! ఈ వీడియో చూస్తేగానీ నమ్మరు..!

టాటా నెక్సాన్ ఈవి భారత మార్కెట్లో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. నెక్సాన్ ఈవి కన్వెర్సిషినల్ ఫాసిల్ ఫ్యూయెల్ పవర్ తో కూడిన ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై ఆధారపడింది. అంతే కాకుండా ఎస్‌యూవీ యొక్క డిజైన్ పరంగా అనేక అప్డేట్స్ కలిగి ఉంది. ఇది 30 kWh, 45 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

READ MORE: Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..!

ఎంజీ విండ్సర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ కారు నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది క్లే బీజ్, పెర్ల్ వైట్, స్టార్బర్స్ట్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది 604 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

READ MORE: SRH: ప్రాక్టీస్ మానేసి భార్యలతో మాల్దీవ్స్ వెళ్తే ఎలా గెలుస్తారు కావ్య?

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ 30 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ 275 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అలాగే 45 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ ఒక పూర్తి ఛార్జ్‌ చేస్తే 489 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరోవైపు.. ఎంజీ విండ్‌సర్ లో కేవలం 38 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. దీని రేంజ్ 332 కిలోమీటర్లు. ఇది సర్టిఫైడ్ రేంజ్‌. ఇందులోని సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp పవర్, 200 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

READ MORE: Viral : అమ్మాయి ప్రేమకు పులి కూడా దాసోహం..! ఈ వీడియో చూస్తేగానీ నమ్మరు..!

కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఎంజీ విండ్‌సర్ లో ఏరో లౌంజ్ సీట్లు, 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే, రియల్ టైమ్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్‌తో పాటు రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ అలర్టులతో సహా 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను కలిగి ఉంది.

Exit mobile version