NTV Telugu Site icon

Tata Nexon 2025: కొత్త అవతార్‌లో నెక్సాన్ 2025 లాంచ్.. బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లకి గట్టి పోటీ..

Tata Nexon 2025

Tata Nexon 2025

Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్‌లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది. 2024లో ఏకంగా 1,61,611 యూనిట్ల నెక్సాన్ కార్లు అమ్ముడుపోయాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో నెక్సాన్ ఒకటిగా ఉంది. కొత్త టాటా నెక్సాన్ ధర రూ. 8 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

* ప్రస్తుతం నెక్సాన్ 2025లో ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ట్రిమ్‌లు నిలిపివేయబడ్డాయి. కొత్తగా ప్యూర్+, ప్యూర్+ ఎస్, క్రియేటివ్+ PS, ఫియర్‌లెస్+ PS వేరియంట్లను తీసుకువచ్చారు.

* ప్యూర్+, ప్యూర్+ ఎస్ వేరియంట్లలో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డింగ్ ORVMలు, హైట్ అడ్జస్ట్‌మెంట్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్+ S లో సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు కూడా ఉన్నాయి.

* ఇక క్రియేటివ్ క్రియేటివ్+ PS వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, బై-ఫంక్షనల్ LED హెడ్‌లైట్లు, ‘X-ఫ్యాక్టర్’ కనెక్టెడ్ టెయిల్‌లైట్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, TPMS, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.

Read Also: IIT Madras: మహిళ రీసెర్చ్ స్కాలర్‌కు లైంగిక వేధింపులు.. నిందితుడు ఎవరంటే..!

* ఫియర్‌లెస్+ PS వేరియంట్ టాప్ వేరియంట్‌గా ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సీక్వెన్షియల్ LED DRLలు, వెంటిలేడెట్ ఫ్రంట్ సీట్లు, 9 జేబీఎల్ స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, కనెక్టెడ్ వెహికిల్ టెక్నాలజీ, ఎయిర్ ప్యూరి‌ఫైయర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

* రంగుల విషయానికి వస్తే కొత్తగా గ్రాస్ ల్యాండ్ బీజ్, రాయల్ బ్లూ, కార్బన్ బ్లాక్, క్రియేటివ్ బ్లూ కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న డేటోనా గ్రే, ప్యూర్ గ్రే , ప్రిస్టైన్ వైట్ రంగులను కొనసాగిస్తున్నారు. ఫ్లేమ్ రెడ్, పర్పుల్ రంగుల్ని నిలిపేశారు. నెక్సాన్ ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు ఏం లేవు. భద్రతా పరంగా 6- ఎయిర్ బ్యాగుల్ని స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. గ్లోబర్ NCAP , భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

* పవర్ ట్రెయిన్స్‌లో మార్పు లేదు. టర్బో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 120 పీఎస్ పవర్/170 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెవోట్రాన్ 1.58 లీటర్ డీజిల్ ఇంజన్ 115 పీఎస్ పవర్/260 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ పెట్రోల్ 5-స్పీడ్, నెక్సాన్ డీజిల్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వెర్షన్‌లో 6-స్పీడ్ మాన్యవల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది.

Show comments