NTV Telugu Site icon

Tata Nano EV Car: మళ్లీ మర్కెట్లో అడుగుపెట్టనున్న టాటా నానో..! ధర ఎంతో తెలుసా?

Tata Nano Ev Car

Tata Nano Ev Car

భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కంపెనీ.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా ఓ కారును తయారు చేశారు. ఇది రతన్ టాటా కలల కారు గా చెప్పుకుంటారు. నేను ఏ కారు గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అదే..టాటా నానో కార్. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం ఈ కార్ల తయారీ నిలిచిపోయింది. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని నిలిపేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ ఇన్నేళ్లకు టాటా కంపెనీ టాటా నానోను మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. అది కూడా ఎలక్ట్రిక్ వర్షన్‌లో.

READ MORE: Saripodhaa Sanivaaram: మైడియర్ విలన్స్ పరుగులు తియ్యండి.. హీరో వస్తున్నాడు

ఎలక్ట్రికల్ కారు రూపంలో టాటా నానో కారును రీ-లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందట. 2024 డిసెంబర్ లో ఈ కారు లాంచింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ సమాచారం ప్రకారం.. టాటా నానో ఈవీ కారుకు 4 డోర్లు, 4 సీట్లు ఉంటాయి. 17 kWh బ్యాటరీతో రాబోతున్న ఈ కారు ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 KM మైలేజ్ ఇస్తుంది. ఈ కారుకు 2 ఎయిర్ బ్యాగ్స్, 3.3 kW, AC ఛార్జర్‌, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. నానో ఎలక్ట్రికల్ కారు బేసిక్ ధర రూ. 5 లక్షలు ఉంటుందని సమాచారం. హైఎండ్ వర్షన్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.