Tata Motors’s Passenger Vehicles to Cost More From November 7: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెరుగనున్నట్లు ప్రకటిచింది. నవంబర్ 7 నుంచి టాటా మోటార్స్ తన కార్ల దరలను పెంచుతోంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం ప్రకటించింది. నవంబర్ 7 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ ను బట్టి 0.9 శాతం పెరుగుదల ఉంటుందని టాటా ప్రకటించింది. పెరిగిన ఖర్చుల కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని టాటా ప్రకటించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: Shiv Sena leader shot dead : పంజాబ్‌లో పోలీసుల ఎదుటే శివసేన నేతపై కాల్పులు
ప్రస్తుతం మార్కెట్ లో టాటా సేల్స్ గణనీయంగా ఉన్నాయి. ఆ కంపెనీ నుంచి వస్తున్న నెక్సాన్ కార్ కాంపాక్ట్ ఎస్ యూ వీల అమ్మకాల్లో టాప్ ప్లేసులో ఉంది. దీంతో పాటు టాటా నెక్సాన్ ఈవీ కూడా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో కూడా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాటా టియాగో ఈవీని తీసుకురాబోతోంది. ప్రీ బుకింగ్స్ లోనే సంచలనాలను నమోదు చేసింది. బుకింగ్స్ ఓపెనింగ్ చేసిన గంటల్లోనే అన్నీ బుక్ అయిపోయాయి. దీంతో పాటు టాటా నుంచి పంచ్, హారియర్, సఫారీ కార్ల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి.
ఈవీ సెగ్మెంట్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది టాటా. ప్రస్తుతం టాటా నుంచి నెక్సాన్, టియాగో ఈవీలు వచ్చారు. రానున్న కాలంలో మరిన్ని ఈవీలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కాలంలో రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు ఆటోమోబైల్స్ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ల కొరత ఇండస్ట్రీని వేధిస్తోంది. కొన్ని కంపెనీల కార్లకు 6 నెలల నుంచి ఏడాది పాటు వెయిటింగ్ పిరియడ్ ఉంది.