NTV Telugu Site icon

Tata Motors: టియాగో, టిగోర్ CNG AMT బుకింగ్స్ ప్రారంభం..

Tata Motors

Tata Motors

Tata Motors: టాటా మోటార్స్ దూసుకుపోతోంది. పెట్రోల్, డిజిల్, సీఎన్‌జీ, ఎలక్టిక్ కార్ల మోడళ్లను వరసగా ప్రవేశపెడుతోంది. తాజాగా టియాగో CNG , టిగోర్ CNG కార్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)ని ప్రవేశపెట్టింది. సీఎన్‌జీ కార్లలో ఇలాగ ఎఎంటీని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీటి బుకింగ్స్‌ని కూడా టాటా మోటార్స్ ప్రారంభించింది. రూ. 21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్ చేసుకోవచ్చు.

Read Also: Himanta Biswa Sarma: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు..

టియాగో CNG AMT మూడు వేరియంట్లలో– XTA, XZA+ మరియు XZA NRG వేరియంట్లలో లభ్యమవుతోది. టిగోర్ CNG AMT రెండు వేరియంట్లు XZA CNG , XZA+ CNG కలిగి ఉంది. టాటా మోటార్స్ తన సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ పెంచేందుకు ట్విన్-సిలిండర్ టెక్నాలజీని తీసుకువచ్చింది.

టియాగో, టిగోర్ రెండూ కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి. ఇది పెట్రోల్ మోడ్‌లో 86PS పవర్, 113Nm టార్క్‌ని, ఇక CNG మోడ్‌లో 73.4PS, 95Nmల శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మరియు CNG వెర్షన్లు రెండూ ఇప్పుడు 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఎంపికలను కలిగి ఉన్నాయి. టాటా మోటార్స్ టియాగోలో టోర్నాడో బ్లూ, టియాగో ఎన్‌ఆర్‌జిలో గ్రాస్‌ల్యాండ్ బీజ్ మరియు టిగోర్‌లోని మెటోర్ బ్రాంజ్ వంటి కొత్త కలర్ ఆప్షన్‌లను తీసుకువస్తోంది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్ కార్లలో సీఎన్‌జీ ఆప్షన్లను అందిస్తోంది.