Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?

  • టాటా మోటార్స్ దీపావళి సందర్భంగా భారీ ఆఫర్స్..
  • ఎంపిక చేసిన కార్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు..
Tata Cars

Tata Cars

Tata Motors Diwali Offers: దీపావళి పండుగ సందర్భంగా సరికొత్త టాటా కారును ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఈ నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులు ఏకంగా రూ. 1.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. మోడల్ వారీగా లభిస్తున్న పూర్తి తగ్గింపు వివరాలు ఇక్కడ చూద్దాం..

టాటా కర్వ్ (Tata Curvv)

యూనిక్ కూపే స్టైలింగ్‌తో ఆకట్టుకుంటున్న టాటా కర్వ్ మోడల్‌పై ఈ నెలలో అత్యధిక తగ్గింపు లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 19.00 లక్షల మధ్య ఉంది. ఇందులో కర్వ్ (నాన్-ఎక్స్ మోడల్) పై గరిష్టంగా రూ. 1,25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 45,000 స్క్రాపేజ్ బోనస్ మరియు రూ. 50,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. అలాగే కర్వ్ ఎక్స్ సిరీస్ మిడ్ వేరియంట్ల సిరీస్‌పై రూ. 20,000 లాయల్టీ బోనస్ లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 18.75 లక్షల మధ్య ఉంటుంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధిక ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ధర రూ. 7.40 లక్షల నుండి రూ. 14.52 లక్షల మధ్య ఉంది. ఇందులో నెక్సాన్ సీఎన్‌జీ గరిష్టంగా రూ. 55,000 వరకు తగ్గింపు లభిస్తుంది (రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ మరియు రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్). నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ లో మొత్తం రూ. 45,000 వరకు (రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ మరియు రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్) ఆదా చేసుకోవచ్చు. అలాగే నెక్సాన్ డీజిల్ వేరియంట్ పై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ. 20,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.

టాటా సియెర్రా (Tata Sierra)

పెట్రోల్ & డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న సరికొత్త టాటా సియెర్రాపై ఈ నెలలో రూ. 60,000 వరకు మొత్తం ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్ (రూ. 30,000), స్క్రాపేజ్ (రూ. 30,000), లెవల్ అప్ (రూ. 30,000), లాయల్టీ బోనస్ (రూ. 30,000) రూపంలో ఆఫర్లు ఉన్నాయి. టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షల నుండి రూ. 21.59 లక్షల వరకు ఉంది.

టాటా హారియర్ డీజిల్ (Tata Harrier Diesel)

పవర్ & ప్రీమియం ఫీచర్లకు పేరుగాంచిన టాటా హారియర్ డీజిల్ వేరియంట్‌పై రూ. 45,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 10,000 డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 35,000 స్క్రాపేజ్ బోనస్ (రెండింటిలో ఒకదానికే వర్తింపు) ఉన్నాయి. హారియర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13 లక్షల నుండి రూ. 26.11 లక్షల వరకు ఉంది.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ప్రీమియం లుక్, అత్యుత్తమ భద్రతా ఫీచర్లు కలిగిన ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 10.90 లక్షల మధ్య ఉంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ & సీఎన్‌జీ వేరియంట్స్ లో రూ. 45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్, రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఇంకా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ పై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ మరియు రూ. 20,000 స్క్రాపేజ్ ఆఫర్లతో కలిపి గరిష్టంగా రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

టాటా టియాగో & టిగోర్

ఫేస్‌లిఫ్ట్ రాకముందు పాత “టాటా టియాగో”లో ఉన్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో మిగిలిన యూనిట్లపై డీలర్‌షిప్‌లు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. దీని పెట్రోల్ వేరియంట్‌పై రూ. 35,000 వరకు (రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్, రూ. 15,000 స్క్రాపేజ్), సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 30,000 వరకు (రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్, రూ. 15,000 స్క్రాపేజ్) ఆఫర్లు లభిస్తున్నాయి. అలాగే టాటా టిగోర్ స్థానంలో సరికొత్త ‘టాటా ఎరిస్’ వచ్చినప్పటికీ.. డీలర్‌షిప్‌ల వద్ద మిగిలి ఉన్న టిగోర్ యూనిట్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ రూపంలో రూ. 30,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.49 లక్షల నుండి రూ. 9.10 లక్షల మధ్య ఉంటుంది.