Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors Car Price Hike: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు మరో షాక్ తగలబోతోంది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్, ఆడి వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ధరల పెంపును ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా చేరింది. తన ప్యాసింజర్ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2026 డిసెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు సగటున 0.5 శాతం వరకు పెరగనున్నాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV) తన మొత్తం ప్యాసింజర్ వెహికల్ పోర్ట్‌ఫోలియోపై ధరల పెంపును ప్రకటించింది. 2026 డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా ఉండనుంది. అయితే అన్ని మోడళ్ల ధరలు ఒకే విధంగా పెరగవని కంపెనీ స్పష్టం చేసింది.
Also Read
- రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
- 501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
- MG Windsor EV Facelift 2027: 449KM రేంజ్.. MG Windsor EVలో భారీ 61kWh బ్యాటరీ! ఎప్పుడు లాంచ్ కానుందంటే?
- Ather Konarc EV: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. నెలలోనే 83 శాతం పెరిగిన అమ్మకాలు.! ఎందుకింత డిమాండ్?
ఏయే కార్ల ధరలు పెరగనున్నాయి?
టాటా మోటార్స్‌కు చెందిన వివిధ విభాగాల కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండనుంది.
హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లు:
టాటా టియాగో
టాటా టిగోర్
టాటా ఆల్ట్రోజ్
SUVలు, క్రాస్ఓవర్లు:
టాటా పంచ్
టాటా నెక్సాన్
టాటా కర్వ్
టాటా సియెర్రా
టాటా హారియర్
టాటా సఫారీ
ఎలక్ట్రిక్ కార్లు:
టాటా టియాగో EV
టాటా పంచ్ EV
టాటా నెక్సాన్ EV
టాటా కర్వ్ EV
టాటా సియెర్రా EV
టాటా హారియర్ EV
ధరల పెంపునకు కారణం ఏమిటి?
కార్ల తయారీకి అవసరమైన ముడిసరుకులు, ఇతర వనరుల ధరలు నిరంతరం పెరుగుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని టాటా మోటార్స్ తెలిపింది.
వాహనాల తయారీకి ఉపయోగించే స్టీల్, ఇతర ముడిసరుకులు, విడిభాగాలు, ఉత్పత్తి వనరుల ఖర్చులు పెరగడంతో కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ అదనపు వ్యయాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు కార్ల ధరలను సవరించాలని నిర్ణయించింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పూర్తిగా వినియోగదారులపై వేయకుండా, కొంత భారాన్ని కంపెనీ కూడా భరిస్తున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే సగటున 0.5 శాతం వరకు ధరలను పెంచుతోంది.
కస్టమర్లు ఎంత అదనంగా చెల్లించాలి?
ప్రస్తుతం ఏ మోడల్‌పై ఎంత ధర పెరుగుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల పెంపు మారనుంది. ఏ కారుపై ఎక్కువ పెంపు ఉంటుంది? ఏ మోడల్‌పై తక్కువగా ఉంటుంది? అనే విషయాలు కొత్త ధరల జాబితా విడుదలైన తర్వాతే స్పష్టమవుతాయి. కాబట్టి టాటా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరలను గమనించాలి.
ఇప్పటికే ధరలు పెంచుతున్న ఇతర కంపెనీలు
కార్ల మార్కెట్లో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి.
మారుతి సుజుకి: ఎంపిక చేసిన కార్ల ధరలను సగటున 0.31 శాతం పెంచింది.
హ్యుందాయ్: డిసెంబర్ 1 నుంచి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.8,000 వరకు పెంచనుంది.
ఆడి: జనవరి 1, 2027 నుంచి కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనుంది.
టాటా మోటార్స్: డిసెంబర్ 1, 2026 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను సగటున 0.5 శాతం పెంచనుంది.
తాజావార్తలు
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఆ ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Ben Stokes-IPL 2027: బీసీసీఐ ప్రత్యేక అనుమతి.. వేలానికి సిద్దమైన బెన్ స్టోక్స్.. బేస్ ప్రైస్ ఎంతంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!