Site icon NTV Telugu

కార్ లవర్స్కి గుడ్న్యూస్.. Tata Safari, Harrierలకు పెట్రోల్ వైర్షన్.. త్వరలోనే షూరు!

Tata

Tata

Tata Harrier and Safari: టాటా మోటార్స్ వెహికల్స్ రాబోయే రోజుల్లో పలు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టాటా హారియర్, టాటా సఫారీ SUVల పెట్రోల్ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటి వరకు భారత మార్కెట్‌లో ఈ రెండు మోడళ్లు డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నప్పటికీ, పెట్రోల్ వెర్షన్ లేకపోవడం వినియోగదారుల్లో అసంతృప్తికి కారణమైంది.

Read Also: Suryakumar Yadav: ‘నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు.. అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

అయితే, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే దిశగా టాటా కంపెనీ అడుగులు వేస్తోంది. హారియర్, సఫారీలకు 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ తో మార్కెట్ లోకి తీసుకు వస్తుంది. టాటా ‘హైపీరియన్ (Hyperion)’గా పిలిచే ఈ ఇంజిన్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో తొలిసారి ప్రదర్శించింది. ఈ పవర్ యూనిట్‌ను డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసే ఛాన్స్ ఉంది. ఈ కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 హెచ్‌పీ పవర్, 280 ఎన్‌ఎం టార్క్ను ఉత్పత్తి చేసేలా రూపొందించారు. ఈ ఇంజిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నవంబర్ 25వ తేదీన టాటా సియేరా మోడల్‌తో కలిసి అధికారికంగా సంస్థ వెల్లడించనుంది.

Read Also: Republic Day: ఈసారి రిపబ్లిక్ డేకు అతిథులుగా వచ్చేదెవరంటే..! భారత్ ఆహ్వానించింది వీళ్లనే!

ఇక, పెట్రోల్ ఇంజిన్ ప్రవేశంతో టాటా హారియర్, సఫారీ SUVలు తమ ప్రత్యర్థులతో పోలిస్తే పోటీలో మరింత ముందుంటారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లోని చాలా SUVలు పెట్రోల్, డీజిల్ రెండింటిని మార్కట్ లో విడుదల చేశాయి. అంతేకాకుండా, పెట్రోల్ వేరియంట్ల లాంచ్ వల్ల ఈ మోడల్స్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం టాటా హారియర్, సఫారీల్లో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 167 హెచ్‌పీ పవర్‌తో పాటు 350 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంది. ధరల విషయానికి వస్తే, టాటా సఫారీ ప్రారంభ ధర రూ.14.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, హారియర్ ధర రూ.14 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

Read Also: Syed Mushtaq Ali Trophy: ఉత్కంఠ పోరులో ఆంధ్ర జట్టు సంచలన విజయం.. మరోసారి నిరాశపరిచిన నితీష్ రెడ్డి..

కాగా, భారత మార్కెట్‌లో టాటా హారియర్, జీప్ కంపాస్, ఎంజీ హెక్టర్ లాంటి మోడల్స్ తో పోటీ పడుతుండగా, మూడు వరుసల సీట్లున్న టాటా సఫారీ మాత్రం మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ ఆల్కజార్, జీప్ మెరిడియన్ వంటి SUVలకు సవాల్ విసురుతోంది. పెట్రోల్ వేరియంట్ల రాకతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Exit mobile version