Tata Curvv: ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న టాటా కర్వ్ జూలై 19న ఆవిష్కరించబడుతోంది. ఈ ఫ్యూచరిస్టిక్ కూపే స్టైట్ ఎస్‌యూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి వచ్చే కర్వ్, పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉండబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగున్, ఎంజీ ఆస్టర్ కార్లకు టాటా కర్వ్ పోటీని ఇవ్వబోతోంది.
ఇక టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, బీవైడీ అట్టో 3, రాబోయే హ్యుందాయ్ క్రేటా ఈవీ కార్లకు పోటీనిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. బలమైన ఈవీ పోర్ట్‌పోలియోను టాటా కలిగి ఉంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ కార్లను కలిగి ఉంది. భవిష్యత్తులో టాటా తన హారియర్ ఈవీని కూడా తీసుకురాబోతోంది.
Read Also: Venu swamy: హీరోహీరోయిన్సే అనుకున్నాము ఇప్పుడు విలన్స్ కూడానా.. వేణుస్వామి క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రస్తుతం రాబోతున్న టాటా కర్వ్‌లో అత్యాధునిక భద్రతతో పాటు టెక్ ఫీచర్లను అందిస్తోంది. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టచ్ ప్యానెల్‌తో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్-బేస్డ్ HVAC కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
టాటా కర్వ్, నెక్సాన్ ఐసీఈ పవర్ ట్రెయిన్‌ని కలిగి ఉంటుంది. ఇది రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120PS మరియు 170Nm), రెవోట్రాన్ 1.5 డీజిల్ ఇంజన్ (115PS మరియు 260Nm)ని కలిగి ఉంటుంది. ట్రాన్స్‌మిషన్లను పరిశీలిస్తే పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీఏ ఆప్షన్లను కలిగి ఉంది. డిజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ స్పెసిఫికేషన్లు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నప్పటికీ, టాటా తన కొత్త ఈవీ ఆర్కిటెక్చర్ అయిన acti.ev (అడ్వాన్సుడ్ కనెక్టెడ్ టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్)పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక్క ఫుల్ ఛార్జ్‌తో 450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. టాటా కర్వ్ పెట్రోల్-డిజిల్ వెర్షన్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 19 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉండొచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 18 లక్షల నుంచి రూ. 21 లక్షలు(ఎక్స్ షోరూం) ఉండే అవకాశం ఉంది.