NTV Telugu Site icon

Tata Curvv EV: టాటా కర్వ్ EV లాంచ్.. ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం..

Tata Curvv Ev

Tata Curvv Ev

Tata Curvv EV: టాటా తన కూపే ఎస్‌యూవీ కర్వ్ EVని లాంచ్ చేసింది. దేశంలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారు కర్వ్ ఈవీ. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ తర్వాత వస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం కర్వ్ EVనే. దీని ప్రారంభ మోడల్ ధర రూ. 17.49 లక్షలతో మొదలై రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీకి, బీవైడీ అట్టో 3కి ప్రత్యర్థిగా ఉండనుంది.

ఇతర టాటా ఈవీ కార్ల మాదిరిగానే టాటా కర్వ్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెర్షన్‌లో 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది 502 కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 55kWh బ్యాటరీ ప్యాక్‌‌తో 585 కి.మీ రేంజ్ ఇస్తుందని చెబుతోంది. టాటా కర్వ్ EV మొత్తం 5 వేరియంట్లు – క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ +S, ఎంపవర్డ్ + , ఎంపవర్డ్ +Aని కలిగి ఉంది.

Read Also: Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..

ఎక్స్ షోరూం పరిచయ ధరలు:

టాటా కర్వ్.ev 45 క్రియేటివ్ – రూ. 17.49 లక్షలు
టాటా కర్వ్.ev 45 అకాంప్లిష్డ్ – రూ. 18.49 లక్షలు
టాటా కర్వ్.ev 45 అకాంప్లిష్డ్ +S – రూ 19.29 లక్షలు
టాటా కర్వ్.ev 55 అకాంప్లిష్డ్ – రూ. 19.25 లక్షలు
టాటా కర్వ్.ev 55 అకాంప్లిష్డ్ + S – రూ. 19.99 లక్షలు
టాటా కర్వ్.ev 55 ఎంపవర్డ్ + – రూ. 21.25 లక్షలు
టాటా కర్వ్.ev 55 ఎంపవర్డ్ +A – రూ. 21.99 లక్షలు

కనెక్టెడ్ LED DRL లైట్లు, LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్‌లతో కూడిన స్వ్కేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంది. వెనకాల LED టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ, వాటర్ వాడింగ్ కెపాసిటీ 450 మిమీ. బూట్ స్పేస్ 500 లీటర్లు కలిగి ఉంది.

ఫీచర్ల విషయాని వస్తే పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కలిగిన 2.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ప్రంట్ వెంటిలేడెట్ సీట్లు, 320 W JBL సౌండ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. కర్వ్ భారత్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి.