Tata Curvv EV: టాటా కర్వ్ EV లాంచ్.. ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం..
- టాటా కర్వ్ EV లాంచ్..
- ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం..
- టాటా నుంచి 5వ ఎలక్ట్రిక్ వాహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Curvv EV: టాటా తన కూపే ఎస్‌యూవీ కర్వ్ EVని లాంచ్ చేసింది. దేశంలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారు కర్వ్ ఈవీ. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ తర్వాత వస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం కర్వ్ EVనే. దీని ప్రారంభ మోడల్ ధర రూ. 17.49 లక్షలతో మొదలై రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీకి, బీవైడీ అట్టో 3కి ప్రత్యర్థిగా ఉండనుంది.
ఇతర టాటా ఈవీ కార్ల మాదిరిగానే టాటా కర్వ్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెర్షన్‌లో 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది 502 కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 55kWh బ్యాటరీ ప్యాక్‌తో 585 కి.మీ రేంజ్ ఇస్తుందని చెబుతోంది. టాటా కర్వ్ EV మొత్తం 5 వేరియంట్లు – క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ +S, ఎంపవర్డ్ + , ఎంపవర్డ్ +Aని కలిగి ఉంది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
Read Also: Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..
ఎక్స్ షోరూం పరిచయ ధరలు:
టాటా కర్వ్.ev 45 క్రియేటివ్ – రూ. 17.49 లక్షలు
టాటా కర్వ్.ev 45 అకాంప్లిష్డ్ – రూ. 18.49 లక్షలు
టాటా కర్వ్.ev 45 అకాంప్లిష్డ్ +S – రూ 19.29 లక్షలు
టాటా కర్వ్.ev 55 అకాంప్లిష్డ్ – రూ. 19.25 లక్షలు
టాటా కర్వ్.ev 55 అకాంప్లిష్డ్ + S – రూ. 19.99 లక్షలు
టాటా కర్వ్.ev 55 ఎంపవర్డ్ + – రూ. 21.25 లక్షలు
టాటా కర్వ్.ev 55 ఎంపవర్డ్ +A – రూ. 21.99 లక్షలు
కనెక్టెడ్ LED DRL లైట్లు, LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్‌లతో కూడిన స్వ్కేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంది. వెనకాల LED టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ, వాటర్ వాడింగ్ కెపాసిటీ 450 మిమీ. బూట్ స్పేస్ 500 లీటర్లు కలిగి ఉంది.
ఫీచర్ల విషయాని వస్తే పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కలిగిన 2.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ప్రంట్ వెంటిలేడెట్ సీట్లు, 320 W JBL సౌండ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. కర్వ్ భారత్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!