Site icon NTV Telugu

Suzuki 350cc Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ!

Suzuki 350cc Bike

Suzuki 350cc Bike

350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత ఆటో మార్కెట్‌ను 350cc బైక్‌లు రారాజుగా ఉన్నాయి. యూరప్, ఆసియా వంటి ప్రధాన మార్కెట్‌లలో కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే భారతదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా ఎంపికలు (బైక్స్) లేవు. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ప్రస్తుతం 350cc విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు. ఈ రెండింటిని సవాల్ చేసేందుకు భారతదేశంలో మరో బైక్ లేదు. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఢీకొట్టడానికి సుజుకీ సిద్ధమవుతోంది.

సుజుకీ కంపెనీ 350cc విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ బైక్‌లను భారత్ కంటే ముందే యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. 350-500cc బైక్‌ల కోసం ఇప్పటికే ఉన్న 398cc, ఫ్యూయల్-ఇంజెక్ట్ , సింగిల్-సిలిండర్ ఇంజిన్ కొత్త వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజిన్ ఇప్పటికే యూరో 5+ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది 37.5 bhpని ఉత్పత్తి చేస్తుంది. ఇది యూరప్‌లోని A2 లైసెన్స్ అవసరాలను అనుగుణంగా ఉంది. ఈ ఇంజిన్ ఇప్పటికే సుజుకి DR-Z4S, DR-Z4SM బైక్‌లలో ఉపయోగించారు. గత కార్బ్యురేటర్ సెటప్‌తో పోలిస్తే.. ఈ సరికొత్త ఇంజిన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్, డ్యూయల్ స్పార్క్ ప్లగ్‌లు సహా రైడ్-బై-వైర్ థ్రోటిల్‌ను కలిగి ఉంది. అధిక కామ్ లిఫ్ట్‌తో ఈ ఇంజిన్ సున్నితమైన పనితీరును అందిస్తుంది.

Also Read: IND vs SA Records: దక్షిణాఫ్రికాపై భారత్‌దే పైచేయి.. టీ20 సిరీస్‌ షెడ్యూల్‌, ఫుల్ టీమ్స్, ముఖాముఖి రికార్డులు ఇవే!

యూకే డేటా ప్రకారం.. అక్టోబర్ 2025లో 126-500cc బైక్‌ల అమ్మకాలు 1,416 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 51-125cc సెగ్మెంట్ తర్వాత రెండవ అత్యధిక అమ్మకాలు. అక్టోబర్‌లో ‘ఆధునిక క్లాసిక్’ బైక్ BSA బాంటమ్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్. మొత్తం అమ్మకాలు 87 యూనిట్లు కాగా.. ఇది యూకేలో 126-500cc సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌గా నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. విదేశీ మార్కెట్లలో కూడా పట్టు సాదించేందుకు ప్రయత్నిస్తోంది. ట్రయంఫ్ 400cc బైక్‌లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్టోబర్‌లో ట్రయంఫ్ 400cc బైక్‌లు 350cc-450cc విభాగంలో 4.53 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. జావా యెజ్డి BSA 6,922 యూనిట్లను విక్రయించింది. మార్కెట్ వాటా 5.10 శాతంగా ఉంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మెటియోర్ 350 వంటి ఉత్పత్తులతో రాయల్ ఎన్ఫీల్డ్ ఈ విభాగంలో ముందంజలో ఉంది.

Exit mobile version