రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు కు డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ క్రమంలో కంపెనీ కొత్త ఫీచర్స్ మరో బైకును మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. క్లాసిక్ 350 బాబర్ పేరుతో మార్కెట్లోకి ఈ బైక్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే క్లాసిక్ 350 మోడల్ బైక్ ఉంది. అయితే దీనిలో బాబర్ డిజైన్ ను తీసుకువస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..
మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయల దాటిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనివిధంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ మధ్య డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా జనాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు జనాలు. దీనికి తగ్గట్టుగానే చాలా రకాల బైక్స్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల ప్రభంజనం నడుస్తున్న నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.. అదే ఈ కొత్త బైకు..
ఈ కొత్త బైకు ఫీచర్స్ గతంలో వచ్చిన బైక్ అప్డేట్ వర్షన్ గా మార్కెట్ లోకి రాబోతుంది.. ఈ బైకు ధర 2.2 లక్షల వరకు ఈ బైక్ ధర ఉంటుందని చెబుతున్నారు. క్లాసిక్ 350 బాబర్ బైక్ కు 350 సీసీ ఇంజన్ ఉంటుందని సమాచారం. అంతేకాకుండా క్లాసిక్ 350 లాగానే మెరుగైన సీటింగ్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు కూడా మనకు వస్తాయి.. ఈ బైకు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఈ బైకు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..