100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- భారత్‌లో రెనాల్ట్ ట్రైబర్ టర్బో కొత్త వేరియంట్ లాంచ్
- 1.0-లీటర్ 3-సిలిండర్ టీసీఈ 100 టర్బో-పెట్రోల్ ఇంజిన్
- 100 హెచ్‌పీ పవర్, 180 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి
- 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో టర్బో ఇంజిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault Triber Turbo: రెనాల్ట్ ఇండియా తన పాపులర్ 7-సీటర్ ఎంపీవీ ట్రైబర్‌లో కొత్త టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. కొత్త Triber TCe 100 ద్వారా స్టాండర్డ్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే మరింత పవర్, టార్క్ అందించే ఆప్షన్‌ను కంపెనీ అందిస్తోంది.
కొత్త ట్రైబర్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ TCe టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 100hp పవర్, 180Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను జత చేశారు.
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
ధర ఎంత?
కొత్త Triber TCe 100 Evolution వేరియంట్ ధర రూ.7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-స్పెక్ Emotion వేరియంట్ ధర రూ.8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. మరోవైపు స్టాండర్డ్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ట్రైబర్ ధర రూ.5.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీంతో టర్బో వెర్షన్ ప్రారంభ ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ.2 లక్షలకు పైగా ఎక్కువగా ఉంది.
100HP పవర్.. 180Nm టార్క్
కొత్త టర్బో ఇంజిన్ 100hp పవర్, 180Nm టార్క్ అందిస్తుంది. స్టాండర్డ్ ట్రైబర్‌లోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72hp, 96Nm మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇంజిన్ రెనాల్ట్ కిగర్, డస్టర్‌లో ఉపయోగించే టర్బో-పెట్రోల్ యూనిట్‌కు సంబంధించినదే. అయితే ట్రైబర్ కోసం దీనిని 180Nm టార్క్ అందించేలా ట్యూన్ చేయడంతో పాటు అప్డేటెడ్ ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అందించారు.
పెరిగిన పవర్, టార్క్ కారణంగా టర్బో ట్రైబర్ పనితీరు మెరుగుపడింది. కంపెనీ ప్రకారం కొత్త TCe 100 వేరియంట్ 0-100kmph వేగాన్ని 10.8 సెకన్లలో అందుకుంటుంది. ఇంధన సామర్థ్యం విషయంలోనూ టర్బో వెర్షన్ స్వల్పంగా మెరుగ్గా ఉంది. ఇది 21kmpl మైలేజ్ ఇస్తుందని రెనాల్ట్ చెబుతోంది. స్టాండర్డ్ 1.0-లీటర్ పెట్రోల్-మాన్యువల్ ట్రైబర్ 19.76kmpl మైలేజ్ అందిస్తుంది.
డిజైన్
ట్రైబర్ టర్బో డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. వెనుక భాగంలో ఉండే ‘Turbo’ బ్యాడ్జ్ మాత్రమే కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు ప్రధాన మార్పుగా ఉంటుంది. ఇది రెనాల్ట్ RGEP ఆర్కిటెక్చర్పైనే ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ ట్రైబర్‌లో ఉన్న 2,636mm వీల్‌బేస్ సహా కొలతలు కూడా అలాగే కొనసాగుతాయి.
భారత మార్కెట్లో రెనాల్ట్కు ట్రైబర్ అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్‌గా కొనసాగుతోంది. కంపెనీ నెలవారీ అమ్మకాలలో దాదాపు సగం వరకు ట్రైబర్ నుంచే వస్తున్నాయి. ఈ ఎంపీవీ సాధారణంగా నెలకు సుమారు 1,500+ యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తోంది. 2026 ఆగస్టులో 1,536 యూనిట్లు విక్రయించింది. భారత్‌లో ట్రైబర్ ఇప్పటికే 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. కొత్త టర్బో-పెట్రోల్ వేరియంట్ ద్వారా మరింత పనితీరు కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించడమే రెనాల్ట్ లక్ష్యంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?