Car sales in FY23:: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్‌వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
Read Also: Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..
ఎఫ్‌వై 19లో 3,377,436 యూనిట్లు అమ్మకాలతో అత్యుత్తమ స్థానంలో ఉండగా.. ఎఫ్‌వై 22లో 3,069,499 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఎఫ్‌వై 19 రికార్డును అధిగమిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు జరిగాయి. ఎఫ్‌వై 19తో పోలిస్తే ఎఫ్‌వై 23లో 15.16 శాతం అధిక విక్రయాలు నమోదు అయ్యాయి. ఇది ఎఫ్‌వై22 పోలిస్తే 26.72 శాతం అధికం.
ముఖ్యంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్(SUVలు) అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్థిక సంవత్సరం 23లో కార్ల అమ్మకాలలో ఒక్క ఎస్‌యూవీ విభాగమే 43.02 శాతం వాటాను కలిగి ఉంది. మొత్తంగా 1,673,488 యూనిట్ల విక్రయం జరిగింది. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతీ సుజుకీ ఎఫ్‌వై 23లో 1,606,870 యూనిట్లను, దీని తర్వాత హ్యుందాయ్ మోటార్స్ 567,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇక దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఫిబ్రవరి నెల వరకు 323,256 యూనిట్లను, మహీంద్రా & మహీంద్రా 350,000 యూనిట్లకు పైగా పాసింజర్ వెహికల్స్ అమ్మకాలను నమోదు చేశాయి. కియా ఇండియా కూడా 269,229తో అత్యుత్తమ పనితీరును కనబరిచింది.