Pulsar NS125 ABS Vs Hero Xtreme 125R: 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ అంటే?
- 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
- ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ అంటే?
- హీరో ఎక్స్ట్రీమ్ 125R Vs బజాజ్ పల్సర్ NS125 ABS
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కువ మంది 125cc బైకులనే కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో దాదాపు ఈ బైకులకే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 125cc బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో బైకులను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాగా బజాజ్ ఆటో ఇటీవల కొత్త పల్సర్ NS125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో, ఇది హీరో ఎక్స్ట్రీమ్ 125R తో పోటీపడుతుంది. మీరు 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ఈ రెండు బైక్‌ల ధర, ఫీచర్ల పరంగా చూసినట్లైతే ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం.
ఇంజిన్
Also Read
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
బజాజ్ పల్సర్ NS125 బైక్ 125 సిసి సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 12 PS శక్తిని, 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, హీరో ఎక్స్ట్రీమ్ 125R.. 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11.3bhp శక్తిని, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు బైక్‌లలోని ఇంజిన్లు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి
ఉంటాయి.
Also Read:Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
ఫీచర్లు
ఫీచర్ల పరంగా రెండు బైక్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. రెండు బైక్‌లకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, ట్యూబ్‌లెస్ టైర్లు, సెల్ఫ్, కిక్ స్టార్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. రెండు బైక్‌లకు 120 సెక్షన్ వెనుక టైర్ ఉంటుంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R లో వెడల్పాటి ఫ్రంట్ ఫోర్కులు, ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్ కూడా ఉన్నాయి. మరోవైపు, పల్సర్ NS125 బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు SMS, కాల్ నోటిఫికేషన్ల వంటి ఫంక్షన్లను కూడా అందిస్తుంది. ఇవి Xtreme 125Rలో అందుబాటులో లేవు.
భద్రత
భద్రత కోసం, రెండు బైక్‌లలో సింగిల్ ఛానల్ ABS అందించబడింది.
Also Read:New Delhi Railway: తొక్కిసలాట జరిగినా.. తగ్గని ప్రయాణికుల రద్దీ..
ధర
ధర విషయానికి వస్తే.. బజాజ్ పల్సర్ NS125 ABS మోడల్ ధర కొంచెం ఎక్కువగా రూ. 1.06 లక్షలు( ఎక్స్-షోరూమ్). హీరో ఎక్స్ట్రీమ్ 125R ABS వేరియంట్ ఎక్స్-షోరూమ్) ధర దాదాపు లక్ష రూపాయలు.
ఏ బైక్ మంచిది?
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, బజాజ్ పల్సర్ NS125, హీరో ఎక్స్ట్రీమ్ 125R కంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ధర విషయంలో హీరో ఎక్స్ట్రీమ్ 125R పల్సర్ కంటే రూ. 6,000 తక్కువ.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!