NTV Telugu Site icon

Pulsar NS125 ABS Vs Hero Xtreme 125R: 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ అంటే?

Bike

Bike

ఎక్కువ మంది 125cc బైకులనే కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో దాదాపు ఈ బైకులకే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 125cc బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో బైకులను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాగా బజాజ్ ఆటో ఇటీవల కొత్త పల్సర్ NS125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో, ఇది హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తో పోటీపడుతుంది. మీరు 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ఈ రెండు బైక్‌ల ధర, ఫీచర్ల పరంగా చూసినట్లైతే ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం.

ఇంజిన్

బజాజ్ పల్సర్ NS125 బైక్ 125 సిసి సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 12 PS శక్తిని, 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R.. 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11.3bhp శక్తిని, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు బైక్‌లలోని ఇంజిన్‌లు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి
ఉంటాయి.

Also Read:Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..

ఫీచర్లు

ఫీచర్ల పరంగా రెండు బైక్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. రెండు బైక్‌లకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, ట్యూబ్‌లెస్ టైర్లు, సెల్ఫ్, కిక్ స్టార్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. రెండు బైక్‌లకు 120 సెక్షన్ వెనుక టైర్ ఉంటుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లో వెడల్పాటి ఫ్రంట్ ఫోర్కులు, ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్ కూడా ఉన్నాయి. మరోవైపు, పల్సర్ NS125 బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు SMS, కాల్ నోటిఫికేషన్‌ల వంటి ఫంక్షన్‌లను కూడా అందిస్తుంది. ఇవి Xtreme 125Rలో అందుబాటులో లేవు.

భద్రత

భద్రత కోసం, రెండు బైక్‌లలో సింగిల్ ఛానల్ ABS అందించబడింది.

Also Read:New Delhi Railway: తొక్కిసలాట జరిగినా.. తగ్గని ప్రయాణికుల రద్దీ..

ధర

ధర విషయానికి వస్తే.. బజాజ్ పల్సర్ NS125 ABS మోడల్ ధర కొంచెం ఎక్కువగా రూ. 1.06 లక్షలు( ఎక్స్-షోరూమ్). హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ABS వేరియంట్ ఎక్స్-షోరూమ్) ధర దాదాపు లక్ష రూపాయలు.

ఏ బైక్ మంచిది?

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, బజాజ్ పల్సర్ NS125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ధర విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R పల్సర్ కంటే రూ. 6,000 తక్కువ.