PM Modi: గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో మారుతి సుజుకి కొత్త తయారీ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కైచీ ఓనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభం అయ్యింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా భారత్ గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో మరింత బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోనుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా చైనాకు పోటీగా నిలిచే దిశగా భావిస్తున్నారు.
Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
ఈ కొత్త ప్లాంట్ లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలు, అలాగే లిథియమ్-అయాన్ బ్యాటరీ సెల్స్, హైబ్రిడ్ వాహనాల కోసం ఎలక్ట్రోడ్స్ తయారు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో తోషిబా, డెన్సో, సుజుకి కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్లాంట్‌లో తయారయ్యే వాహనాలు, ముఖ్యంగా బ్రాండ్ తొలి ఎలక్ట్రిక్ కారు e-విటారా (BEV) సహా, 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
వైర్‌లెస్ స్పీకర్లలో స్మార్ట్ ఆడియో సెటప్.. కొత్త TCL Z100 లాంచ్!
ఈ హన్సల్పూర్ ప్లాంట్ ప్రతి ఏడాది మూడు ప్రొడక్షన్ లైన్ల ద్వారా ఏకంగా 7.5 లక్షల వాహనాలు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది తాజాగా సుజుకి మోటార్ కార్పొరేషన్ నుండి మారుతి సుజుకి చేతికి వచ్చింది. ప్రస్తుతం కంపెనీకి గురుగ్రామ్, మనేసర్ (హరియాణా), హన్సల్పూర్ (గుజరాత్) సహా మూడు ప్లాంట్లలో కలిపి 2.35 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. భవిష్యత్ లక్ష్యంగా మారుతి సుజుకి ఈ దశాబ్దం చివరినాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రకటించింది. ఇందుకోసం హరియాణాలోని ఖార్కొదా గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిందని.. దీని ప్రాథమిక సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా పేర్కొంది. అంతేకాకుండా గుజరాత్‌లో మరొక గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది కంపెనీ.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi says, "India has the power of Democracy. India has the advantage of Demography. We also have a very large pool of Skilled Workforce. Therefore, this creates a Win-Win Situation for every Partner of ours. Today, Suzuki… pic.twitter.com/spTiIuh3Wj
— ANI (@ANI) August 26, 2025
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and Toshihiro Suzuki, President & Representative Director of Suzuki Motor Corporation, flagged off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.… pic.twitter.com/LPKWBjdykN
— ANI (@ANI) August 26, 2025