Site icon NTV Telugu

Best Mileage Cars: బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే

Car

Car

పెట్రోల్ ధరలు వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది లేకుండాపోయింది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రలో ధర రూ. 100కు పైగానే ఉంది. పెట్రోల్ కార్లు వాడే వారికి ఇది మరింత భారంగా మారింది. లాంగ్ జర్నీ చేసే వారు పెట్రోల్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం పలు ఆటో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరల్లో గరిష్ట మైలేజీని అందించే పెట్రోల్ కార్లను తీసుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Also Read:SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై పిల్..

మారుతి సుజుకి ఆల్టో K10

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి నుంచి అత్యంత చౌకైన కారుగా ఆల్టో కె10 వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఆల్టో కె10 కారు ఒక లీటరు పెట్రోల్ తో 24.90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి స్విఫ్ట్

మారుతి కూడా స్విఫ్ట్‌ను అందిస్తోంది . కంపెనీ ప్రకారం ఈ కారు ఒక లీటరు పెట్రోల్‌తో 25.75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న స్విఫ్ట్ ఒక లీటరు పెట్రోల్ తో 24.80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read:First Night: శోభనం రోజు భర్త ముందే.. లవర్‌కి వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే..!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా

అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి SUV కూడా ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే గ్రాండ్ విటారాను ఒక లీటరులో 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.11.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని బలమైన హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు సగటున 27.97 కిలోమీటర్లు ఇస్తుంది.

Also Read:Sonakshi Sinha : ఇండియాలో మాత్రం చచ్చినా బికినీ వేసుకోను..

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUVని సూపర్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో అందిస్తోంది. ఈ SUV పెట్రోల్ ఇంజన్, హైబ్రిడ్ టెక్నాలజీతో అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఒక లీటరు పెట్రోల్‌తో 27.97 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.11.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read:BNS Srinivas: తెలుగు వారి కోసం ప్రపంచ నిపుణుల జ్ఞానాన్ని అందిస్తున్న మార్గదర్శి

హోండా సిటీ హైబ్రిడ్

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా సిటీని సెడాన్ కారుగా తీసుకొచ్చింది. దీని హైబ్రిడ్ వెర్షన్ ఒక లీటరు పెట్రోల్‌తో 26.5 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version