Ola Electric: క్షీణించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
- ఫిబ్రవరి అమ్మకాల డాటా విడుదల చేసిన ఓలా
- గతేడాదితో పోలిస్తే క్షీణించిన అమ్మకాలు
- ఈ ఏడాది 25.86% తక్కువ విక్రయాలు
- కారణాన్ని వెల్లడించిన ఓలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2025కి సంబంధించి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ 25,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 25.86% తక్కువ. ఫిబ్రవరి 2024లో కంపెనీ 33,722 యూనిట్లను అమ్మింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 28% మార్కెట్ వాటాతో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.
అమ్మకాలు ఎందుకు తగ్గాయి?
వాహన రిజిస్ట్రేషన్ ఏజెన్సీలతో తన ఒప్పందాలను సవరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఖర్చులను తగ్గించడానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడానికి ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీని కారణంగా ఫిబ్రవరిలో వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సంఖ్యలు తాత్కాలికంగా తగ్గాయని వెల్లడించింది. జనవరి 2025 తో పోలిస్తే.. ఫిబ్రవరిలో అమ్మకాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. జనవరిలో కంపెనీ 24,330 యూనిట్లు విక్రయించింది. ఓలా S1 సిరీస్ స్కూటర్ ను 4,000 కి పైగా సొంతం చేసుకున్నారు.
Also Read
- Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
- Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
- Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
కాగా.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల మూడోతరం జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ పేరిట మొత్తం నాలుగు రకాల స్కూటర్లను వివిధ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79 వేల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1.69 లక్షల వరకు ఉన్నాయి. గతంలో ఉన్న మోడళ్లకు అదనంగా ఎస్1 ప్రో+ మోడల్‌ను తీసుకురావడం గమనార్హం.
మోడళ్లు ఇవే..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్1 ప్రో+ పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి ఓలా పరిచయం చేసింది. ఇది 5.3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. వీటి ధరలు రూ.1,69,999 రూ.1,54,999గా కంపెనీ నిర్ణయించింది. ఎస్ 1 ప్రో 4kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,34,999; 3kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,14,999గా నిర్ణయించారు. ఎస్ 1ఎక్స్ 2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. 3kWh వేరియంట్ ధర రూ.89,999, 4kWh ధర రూ.99,999గా కంపెనీ వెల్లడించింది. ఎస్1 ఎక్స్+ 4kWh బ్యాటరీ ఆప్షన్‌తో మాత్రమే వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.1,07,999గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?