రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Terrano SUV: నిస్సాన్ తన కొత్త టెర్రానో (Terrano) SUVని ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్ ఆటో షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. తొలుత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌గా పరిచయమైన ఈ SUVలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు తాజాగా వెల్లడైంది. చైనాలోని పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) విడుదల చేసిన వివరాలతో ఈ SUVకి సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లు బయటపడ్డాయి. నిస్సాన్ టెర్రానో పొడవు 5,098 మి.మీ., వీల్‌బేస్ 2,850 మి.మీ.గా ఉంది. 4,795 మి.మీ. పొడవు, 2,745 మి.మీ. వీల్‌బేస్ కలిగిన టయోటా ఫార్చ్యూనర్‌తో పోలిస్తే ఇది పెద్దది.
ఈ SUV నిస్సాన్ ఫ్రంటియర్ ప్రో పికప్ ఆధారంగా రూపొందించిన లాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. ఇందులో 36 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 31 డిగ్రీల డిపార్చర్ యాంగిల్ ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 2,500 కిలోల టోయింగ్ సామర్థ్యం అందించనున్నారు. నిస్సాన్ టెర్రానోలో పెట్రోల్, డీజిల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఆప్షన్లు ఉండనున్నాయి.
Also Read
- బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
- 999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
- కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
– పెట్రోల్: 2.0 లీటర్ టర్బో ఇంజిన్, 258 PS పవర్.
– డీజిల్: 2.3 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో ఇంజిన్, 190 PS పవర్.
– PHEV: 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (207 PS), 78 PS పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్.
PHEV మోడల్ మొత్తం 272 PS కంబైన్డ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించనున్నారు. అయితే బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించలేదు. పెట్రోల్, డీజిల్ వేరియంట్ల గరిష్ఠ వేగం గంటకు 170 కి.మీ. కాగా, PHEV మోడల్ గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. MIIT విడుదల చేసిన చిత్రాల ప్రకారం టెర్రానో బాక్సీ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ముందు భాగంలో ప్రత్యేకమైన లైటింగ్ ఎలిమెంట్లు, NISSAN అక్షరాలు, నిటారుగా ఉండే ఫ్రంట్ డిజైన్, రగ్గడ్ బంపర్ ఉన్నాయి. సైడ్‌లో స్క్వేర్ వీల్ ఆర్చెస్, ఫ్లాట్ రూఫ్‌లైన్, రూఫ్ రెయిల్స్, సైడ్ స్టెప్స్, పెద్ద అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్, స్పేర్ వీల్, భారీ బంపర్ ఉన్నాయి. PHEV వెర్షన్లో బ్లాక్ ఫినిషింగ్ టెయిల్‌గేట్ ఉండగా, పెట్రోల్, డీజిల్ మోడళ్లలో బాడీ కలర్ టెయిల్‌గేట్ అందించారు.
ఇంటీరియర్ వివరాలను నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఫ్రంటియర్ ప్రో నుంచి కొన్ని ఫీచర్లు ఇందులో అందించే అవకాశం ఉంది. ఇందులో 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.6 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండవచ్చని అంచనా. సన్‌రూఫ్, టో హిచ్, సైడ్ స్టెప్స్, విభిన్న బంపర్, వీల్ డిజైన్లు, రియర్ స్పాయిలర్ వంటి ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. నిస్సాన్ టెర్రానోను చైనాలో Zhengzhou Nissan జాయింట్ వెంచర్ తయారు చేయనుంది. చైనాతో పాటు లాటిన్ అమెరికా, ASEAN దేశాలు, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలోనూ విక్రయించనున్నారు. భారత్‌లో కూడా ఈ SUVని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నిస్సాన్ ఇండియా పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా 2027 లేదా 2028లో టెర్రానోను తీసుకురావచ్చని అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన స్టాలిన్..
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ ముందుకు రావాలి.. హీరో నాగార్జున పిలుపు
-
Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. విద్యార్థినిపై పడిన ఇనుప రేకుల కట్ట!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!