New Hyundai Venue: ఇటీవల Hyundai Venue కొత్త రూపంలో లాంచ్ అయింది. గతంలో పోలిస్తే మరింత పెద్దదిగా, మరిన్ని లోడెడ్ ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం, కార్ మార్కెట్‌లో Hyundai Venueకు భారీ డిమాండ్ నెలకొంది. Hyundai తన కొత్త కారు బుకింగ్స్‌ను అక్టోబర్ 24 నుంచి ప్రారంభించింది. నవంబర్ 4న ధరల్ని ప్రకటించింది. అప్పటి నుంచి వెన్యూ బుకింగ్స్ స్పీడ్ అందుకుంది. ప్రారంభించిన నెలలోనే 32,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. నవంబర్ 2025లో హ్యుందాయ్ ఇండియా మొత్తం 66,840 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
రీడిజైన్ చేసిన హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు కొత్త ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. బోనెట్‌పై LED స్ట్రిప్, హెడ్‌ల్యాంప్ యూనిట్ చుట్టూ ఉన్న డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు) కారును మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. బంపర్ కింద స్కిడ్ ప్లేట్లు, కొత్త ఫంక్షనల్ రూఫ్ రైల్ ఉంది. వెనక డిజైన్లో LED టెయిల్‌లైట్‌ల అప్డేట్ చేశారు. కొత్తగా ఉన్న అల్లాయ్ వీల్స్‌ను కారులో తీసుకువచ్చారు. కొత్త వెర్షన్ పాత వెన్యూ కన్నా 48 mm పొడవు, 30 mm వెడల్పుగా ఉంది. దీని కొలతలు 3995 mm పొడవు, 1800 mm వెడల్పు, 1665 mm ఎత్తు, వీల్‌బేస్ 2520 mm ఉంది.
కొత్త వెన్యూలో డ్యూయల్ 62.5 cm (12.3-అంగుళాల+12.3-అంగుళాల) కర్వ్డ్ పనోరమిక్ డిస్‌ప్లే ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. ఇదే కాకుండా ప్రీమియం లెదర్ ఆర్మ్ రెస్ట్, D-కట్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ 4-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టూ లెవల్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,రియర్ AC వెంట్స్ ఉన్నాయి. బ్రాండ్ 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో కారులో వస్తోంది. కొత్త వెన్యూలో 65 కన్నా ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, హిల్-స్టార్ట్ అసిస్ట్, TPMS, 360-డిగ్రీ కెమెరాలు, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ మరియు లెవెల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి.
కొత్త వెన్యూలో మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. కప్పా 1.2 లీటర్ MPi పెట్రోల్, కప్పా 1.0 లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజన్లతో వస్తోంది. మాన్యువల్, ఆటోమేటిక్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మీషన్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది.
