NTV Telugu Site icon

Honda Unicorn Launch: సరికొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా.. బెస్ట్ ఫీచర్లు! 10 సంవత్సరాల వారంటీ

Honda Unicorn

Honda Unicorn

New Honda Unicorn Launch 2023: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా ‘యునికార్న్’ బైక్‌ను గతంలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్‌లో సరికొత్త అప్‌డేట్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. కొత్త రియల్ డ్రైవింగ్ ఉద్గార నిబంధనల ప్రకారం (BS6 OBD2 PGM-FI) హోండా ఈ మోటార్‌సైకిల్ ఇంజన్‌ని అప్‌డేట్ చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన OBD 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా యునికార్న్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ బైక్ అద్భుతమైన లుక్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది.

Honda Unicorn Price:
హోండా యునికార్న్ బైక్‌ ధర ఎక్స్‌-షోరూమ్‌లో రూ.1,09,800గా ఉంది. హోండా యునికార్న్ పథ మోడల్ కంటే.. కొత్త మోడల్ ధర రూ.4100 వేలు ఎక్కువ. కొత్త అప్‌డేట్‌ల కారణంగా ఈ బైక్‌ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. హోండా కంపెనీ ఇంజన్‌కి సంబంధించిన అప్‌డేట్‌లతో పాటు పలు కాస్మెటిక్ మార్పులను చేసింది. ఇది 160సీసీ ప్రీమియం బైక్. ఇందులో లాంగ్ సింగిల్ పీస్ సీట్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

Honda Unicorn Colors:
హోండా యునికార్న్ యొక్క ఈ అప్‌డేట్ వెర్షన్‌ బైక్ నాలుగు కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ కలర్‌లలో ఈ బైక్ వస్తుంది.

Honda Unicorn Warrenty:
హోండా యునికార్న్ బైక్‌ను కొనుగోలు చేస్తే మీరు 10 సంవత్సరాల వారంటీని పొందుతారు. ఇందులో 3 సంవత్సరాల ప్రామాణిక మరియు 7 సంవత్సరాల పొడిగింపు వారంటీ ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ, సీట్ ఎత్తు 798 మిమీ, కర్బ్ వెయిట్ 140 కిలోలు. ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లుగా ఉంది.

Also Read: OLA Electric Car Images: టెస్లాకు పోటీగా ఓలా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌పై 500 కిమీ ప్రయాణం! ధర ఎంతంటే

Honda Unicorn Features:
యునికార్న్ బైక్‌లో 130 ఎంఎం బ్యాక్ డ్రమ్ బ్రేక్ మరియు 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ ఉన్నాయి. ఈ బైక్‌కి మోనోషాక్ రియర్ సస్పెన్షన్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది మూడు-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మీకు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Honda Unicorn Mileage:
ఈ బైక్‌లో 160 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 13 హెచ్‌పీ పవర్ వద్ద 14.58 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త హోండా యూనికార్న్‌ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికలో అందుబాటులో ఉంటుంది. ఇది 50 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది.

Also Read: MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్

 

Show comments