NTV Telugu Site icon

JSW MG: దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ.. కొత్త వేరియంట్ వచ్చేసిందోచ్..

Mg Comet Ev Blackstorm

Mg Comet Ev Blackstorm

జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్‌ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్‌ బ్లాక్‌స్టార్మ్‌ (MG Comet EV Blackstorm) వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

READ MORE: Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ కోసం సంజయ్ దత్?

ఒక వేళ బ్యాటరీ అద్దెకు తీసుకోవాలను కుంటే.. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీసు విధానంలో కిలోమీటర్‌కు రూ.2.5 చొప్పున కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ బ్లాక్‌స్టార్మ్‌ను టాప్ వేరియంట్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది. దీన్ని కొనాలనుకుంటే కస్టమర్ రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త వేరియంట్ ‘స్టార్రి బ్లాక్’ కలర్‌లో ఉంటుంది. దీనిపై ఎర్రటి చారలు ఉన్నాయి. లోపలిభాగంలోనూ బ్లాక్‌ థీమ్‌ను కంపెనీ ఫాలో అయ్యింది. ఇంటర్నెట్ ఇన్సైడ్ లోగో నలుపు రంగులో రూపొందించారు. ఇది వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. లెథరెట్ సీట్లలో ఎరుపు రంగులో ‘బ్లాక్‌స్టార్మ్’ అనే పదం రాసి ఉంది. ఇది ప్రీమియం అనుభవాన్ని మరింత పెంచుతుంది.

READ MORE: UP Encounter: యూపీలో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం..

12 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. కీలెస్‌ ఎంట్రీ, మాన్యువల్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, హీటింగ్‌, ఫోల్డబుల్‌ ఔట్‌సైడ్‌ రియర్‌వ్యూ మిర్రర్స్‌, యూఎస్‌బీ పోర్ట్స్‌, 12V పవర్‌ ఔట్‌లెట్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. 55 రకాల కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం.. కంపెనీ ఇందులో 4 స్పీకర్లను అందించింది. ఈ కొత్త వెర్షన్‌లో 17.4 kWh బ్యాటరీ అమర్చారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ 41 hp పవర్‌ను, 110 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.