NTV Telugu Site icon

JSW MG: ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఎంతో తెలిస్తే వెంటనే వెళ్లి కొనేస్తారు..!

Mg Cars

Mg Cars

JSW MG మోటార్స్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు నుండి పూర్తి పరిమాణ SUV సెగ్మెంట్ వరకు వాహనాలను అందిస్తుంది. మీరు ఫిబ్రవరి 2025లో కంపెనీకి చెందిన ఏదైనా SUV లేదా EV కొనుగోలు కోసం ప్లాన్ చేస్తే.. MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో మీరు ఏ కారు పై ఎంత తగ్గింపు పొందవచ్చు అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం..

Read Also: Hyundai Exter: దుమ్మురేపే ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్.. ధర ఎంతంటే?

1. JSW MG కామెట్ EV
దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును JSW MG కామెట్ EV రూపంలో అందిస్తోంది. మీరు ఫిబ్రవరి 2025లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. గరిష్టంగా రూ. 40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆదా దాని 2024 మోడళ్లపై అందించనుంది. 2025 లో తయారు చేసిన యూనిట్‌ను కొనుగోలు చేస్తే రూ. 35 వేల వరకు ఆఫర్‌లను అందిస్తోంది.

2. JSW MG ఆస్టర్ (మిడ్-సైజు SUV)
JSW MG ఆస్టర్ మిడ్-సైజు 2024 మోడల్స్ పై రూ.1.45 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. అదే 2025 మోడల్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలో గరిష్టంగా రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు.

3. JSW MG హెక్టర్
JSW MG హెక్టర్ 2024 హెక్టర్ డీజిల్ మోడల్ పై రూ.2 లక్షలు వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో పెట్రోల్ యూనిట్లపై రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

4. కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లు లేవు
JSW MG విండ్సర్, JSW MG గ్లోస్టర్ మోడల్స్ పై ఈ నెలలో ఎటువంటి డిస్కౌంట్లు అందించడం లేదు.

ఈ నెలలో మీరు MG కార్లను కొనుగోలు చేయాలనుకుంటే.. వివిధ మోడల్స్ పై గొప్ప ఆఫర్లను పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే షోరూంను సంప్రదించి మీకు నచ్చిన కారును తీసుకొచ్చుకోండి.