దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకి సంస్థ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకికి చెందిన విటారాకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కారును మార్కెట్లోకి ప్రవేశిస్తే.. సంచలనం సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
READ MORE: CM Chandrababu: సీఎం హామీ ఇచ్చారు.. కలెక్టర్ అమలు చేశారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కొత్త ఈవీ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈమేరకు ఫస్ట్ ఈవీకి సంబంధించిన లుక్‌ను టీజ్ కూడా విడుదల చేసింది. ఈ లుక్ మరుతీ ప్రియుల్ని ఆకర్శిస్తోంది. ఈ-విటారా భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ చేయనున్నారు. వీటి తయారీ భారత్‌లోనే చేపట్టనుంది. దశాబ్దాల ఆటోమోటివ్ నైపుణ్యం, అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీఈఓ పార్థో బెనర్జీ తెలిపారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో మారుతీ కొత్త కారును ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈవీలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా వినియోగదారులకు మెరుగైన కస్టమర్ సేవలు అందించమే బెనర్జీ అన్నారు.
READ MORE: Chandrababu: త్వరలో 1995 సీఎంను చూస్తారు.. వారికి చంద్రబాబు హెచ్చరిక