దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకి సంస్థ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకికి చెందిన విటారాకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.