Site icon NTV Telugu

5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ ఉన్న Maruti Suzuki Victoris ధరలు వచ్చేశాయ్.. రూ.10.50 లక్షల నుండి మొదలు!

Maruti Suzuki Victoris

Maruti Suzuki Victoris

Maruti Suzuki Victoris: మారుతీ సుజికి (Maruti Suzuki) నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీ (SUV) అమ్మకాలు సెప్టెంబర్ 22 నుండి అధికారికంగా మొదలుకానున్నాయి. అయితే, ఇప్పటికే బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీనితో ఇది మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.

వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. విక్టోరిస్‌కు భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. కస్టమర్లు దీని ఇంటెలిజెంట్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు, కొత్త డిజైన్, ఆల్-రౌండ్ సేఫ్టీ వంటి వాటిపై ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో విక్టోరిస్ ప్రారంభ ధరను రూ. 10,49,900గా ప్రకటించడం మాకు సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ మంచి పనితీరు, 5-స్టార్ సేఫ్టీ, అత్యాధునిక ఫీచర్లతో నేటి యువతరం ఆశలను తీర్చగలదని ఆయన అన్నారు. ఈ ఎస్‌యూవీ వివిధ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 5MT
* LXi: Rs 10,49,900
* VXi: Rs 11,79,900
* ZXi: Rs 13,56,900
* ZXi (O): Rs 14,07,900
* ZXi+: Rs 15,23,900
* ZXi+ (O): Rs 15,81,900

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 6AT
* VXi: Rs 13,35,900
* ZXi: Rs 15,12,900
* ZXi (O): Rs 15,63,900
* ZXi+: Rs 17,18,900
* ZXi+ (O): Rs 17,76,900

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – ఆల్‌గ్రిప్ సెలెక్ట్ (6AT)
* ZXi+: Rs 18,63,900
* ZXi+ (O): Rs 19,21,900

వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!

స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT)
* VXi: Rs 16,37,900
* ZXi: Rs 17,79,900
* ZXi (O): Rs 18,38,900
* ZXi+: Rs 19,46,900
* ZXi+ (O): Rs 19,98,900

1.5L NA పెట్రోల్ S-CNG – 5MT
* LXi: Rs 11,49,900
* VXi: Rs 12,79,900
* ZXi: Rs 14,56,900

వీటిని, మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ఆప్షన్ ద్వారా కూడా పొందవచ్చు. దీనికి నెలవారీ ఫీజు రూ. 27,707 నుండి ప్రారంభమవుతుంది.

Exit mobile version