NTV Telugu Site icon

2024 Maruti Suzuki Swift: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ వచ్చేసిందోచ్.. ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు.. 25 కి.మీ మైలేజ్..

2024 Maruti Suzuki Swift

2024 Maruti Suzuki Swift

2024 Maruti Suzuki Swift: మారుతి సుజుకి నుంచి ఫోర్ట్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ కారు ఈ రోజు లాంచ్ అయింది. మరిన్ని టెక్ ఫీచర్లు, సేఫ్టీతో కొత్త స్విఫ్ట్ మార్కెట్‌లోకి వచ్చింది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కారును మారుతి సుజుకి రంగంలోకి దించింది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.64 లక్షల(ఎక్స్-షోరూమ్)గా ఉంది. నెలకు రూ. 17,436 ధరతో ఈ వాహనాన్ని సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన కూడా పొందవచ్చు. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 82PS శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMTతో ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్లను కలిగి ఉంది.

ఫోర్త్ జనరేషన్‌గా వచ్చిన ఈ మోడల్ ఇంధన మైలేజ్ పెరిగింది. 5-స్పీడ్ MT వెర్షన్‌కు లీటర్‌కి 24.8 కి.మీ., 5-స్పీడ్ AMT వెర్షన్‌కి 25.75 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మొత్తం ఐదు వేరియంట్లలో కొత్త స్విఫ్ట్ అందుబాటులో ఉంది. LXi, VXi, VXi(O), ZXi మరియు ZXi+ వేరియంట్లను కలిగి ఉంది. మారుతి ఇప్పటి వరకు దేశంలో 30 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. మొదటి తరం స్విఫ్ట్ 2005లో విడుదల కాగా, సెకండ్ జనరేషణ్ 2011లో, థర్డ్ జనరేషన్ 2018లో ప్రవేశపెట్టారు.

Read Also: Kota: కోటాలో ఓ విద్యార్థి మిస్సింగ్.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్తున్నట్లు మెస్సెజ్

గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా కారు రూపుదిద్దుకుంది. LED DRLలతో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. వెనకవైపు LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కారు ముందు వెనక బంపర్ రీడిజైన్ చేయబడ్డాయి. 15 ఇంచ్ ప్రెసిషన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4.2 ఇంచ్ MIDతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు Arkamys సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 40 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలో ఈసారి మారుతి మరింత దృఢంగా వ్యవహరించింది. 45 శాతం హై టెన్సైల్ స్టీల్, 20 శాతం ఆల్ట్రా హై టెన్సైల్ స్టీల్ ఉపయోగించారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. త్రీ పాయింట్ సీట్ బెల్ట్, లక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBD మరియు హిల్‌తో కూడిన ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మాత్రమే కాకుండా, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మైక్రో ఎస్‌యూవీలకు పోటీ ఇస్తుంది.

వేరియంట్ వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు (ఎక్స్-షోరూమ్):

2024 స్విఫ్ట్ LXi MT – రూ. 6.49 లక్షలు
2024 స్విఫ్ట్ VXi MT – రూ. 7.29 లక్షలు
2024 స్విఫ్ట్ VXi AMT – రూ. 7.79 లక్షలు
2024 స్విఫ్ట్ VXi (O) MT – రూ. 7.56 లక్షలు
2024 స్విఫ్ట్ VXi (O) AMT – రూ. 8.06 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi MT – రూ. 8.29 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi AMT – రూ. 8.79 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ MT – రూ. 8.99 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ AMT – రూ. 9.49 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ MT డ్యూయల్ టోన్ – రూ. 9.14 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ AMT డ్యూయల్ టోన్ – రూ. 9.64 లక్షలు