Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం తగ్గించింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చిన్న సెగ్మెంట్ కార్లపై జీఎస్టీ రాయితీలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి తన ప్రజాదరణ పొందిన మోడళ్లపై అదనపు డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. దీనితో వినియోగదారులకు మరింత అందుబాటులో ధరలను అందించడం ద్వారా తన మార్కెట్ షేర్‌ను పెంచుకోవడమే కంపెనీ లక్ష్యంగా సాగుతోంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుండగా, డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం!
ఈ క్రమంలో ఎస్-ప్రెసో (S-Presso)పై రూ. 1,29,600 వరకు తగ్గింపు లభించగా.. కొత్త ప్రారంభ ధర రూ. 3,49,900గా ఉంది. ఆల్టో K10 (Alto K10)పై రూ. 1,07,600 వరకు తగ్గింపు లభించగా, ప్రారంభ ధర రూ. 3,69,900గా నిర్ణయించారు. సెలెరియో (Celerio) ధర రూ. 94,100 తగ్గి, ఇప్పుడు రూ. 4,69,900 నుండి లభిస్తోంది. వాగన్-ఆర్ (Wagon-R)పై రూ. 79,600 తగ్గింపు అమలవడంతో కొత్త ధర రూ. 4,98,900గా ఉంది.
ఇక అలాగే ఇగ్నిస్ (Ignis) ధర రూ. 71,300 తగ్గి రూ. 5,35,100 నుండి ప్రారంభమవుతోంది. స్విఫ్ట్ (Swift)పై రూ. 84,600 తగ్గింపుతో ధర రూ. 5,78,900గా నిర్ణయించారు. బలెనో (Baleno)పై రూ. 86,100 తగ్గింపుతో కొత్త ధర రూ. 5,98,900గా ఉంది. డిజైర్ (Dzire)పై రూ. 87,700 తగ్గింపుతో ధర రూ. 6,25,600గా నిర్ణయించారు. ఫ్రాంక్స్ (Fronx)పై రూ. 1,12,600 తగ్గింపుతో కొత్త ధర రూ. 6,84,900గా ఉంది. బ్రెజ్జా (Brezza) ధర రూ. 1,12,700 తగ్గి రూ. 8,25,900 నుండి ప్రారంభమవుతోంది. గ్రాండ్ విటారా (Grand Vitara)పై రూ. 1,07,000 తగ్గింపుతో ధర రూ. 10,76,500గా ఉంది.
Air India: మరోసారి ఎయిర్ఇండియా విమానానికి తప్పిన భారీ ముప్పు..!
ఇంకా జిమ్నీ (Jimny) ధర రూ. 51,900 తగ్గి రూ. 12,31,500గా ఉంది. ఎర్టిగా (Ertiga)పై రూ. 46,400 తగ్గింపుతో కొత్త ధర రూ. 8,80,000గా ఉంది. XL6పై రూ. 52,000 తగ్గింపు లభించగా, కొత్త ధర రూ. 11,52,300గా ఉంది. ఇన్విక్టో (Invicto) ధర రూ. 61,700 తగ్గి రూ. 24,97,400గా ఉంది. ఈకో (Eeco)పై రూ. 68,000 తగ్గింపుతో కొత్త ప్రారంభ ధర రూ. 5,18,100గా నిర్ణయించారు.
