NTV Telugu Site icon

Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీపై రూ. లక్ష తగ్గింపు..

Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny

మారుతి సుజుకి జిమ్నీ కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఆ కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రతి నెలా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో జిమ్నీని కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష నగదు తగ్గింపు లభిస్తుంది. అయితే.. కంపెనీ దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ను అందించడం లేదు. జిమ్నీ ప్రారంభ ధర రూ. 12.76 లక్షలు. ఇప్పటికే జిమ్నీ జపాన్‌లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. విడుదల చేసిన కొన్ని రోజులకే 50 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ఈ కారును పొందాలంటే 3.5 సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంది.

READ MORE: Movie Ticket Price: సినిమా టికెట్టు ధర రూ. 200 కంటే మించొద్దు.. సీఎం సంచలన నిర్ణయం

మహీంద్రా థార్‌ రాక్స్‌, ఫోర్స్‌ గుర్ఖా వంటి 5 డోర్‌ ఎస్‌యూవీలకు జిమ్నీ పోటీ ఇస్తోంది. ఇక ఈ ఎస్‌యూవీ ఫీచర్ల విషయానికొస్తే.. 1.5 లీటర్‌, 4- సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వచ్చింది. 105 హెచ్‌పీ శక్తిని, 134 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, 4-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను పొందుపర్చారు. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌కు 16.94 కి.మీ., అదే ఆటోమేటిక్ వేరియంట్‌ లీటర్‌కు 16.39 కి.మీ. మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 5 డోర్లతో వస్తున్న ఈ కారుకు 210ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంది.

READ MORE: Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్