NTV Telugu Site icon

Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..

Jimny

Jimny

Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది జిమ్నీ. ఇప్పటికే ఈ ఆఫ్ రోడర్ కార్ పై చాలా ఆసక్తి నెలకొంది. దీనికి అనుగుణంగానే భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. ఇది జూన్ 5న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతోంది. మారుతి సుజుకీ నెక్సా అవుట్ లెట్స్ లో జిమ్నీ అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిమ్నీ మార్కెట్ లోని మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు పోటీ ఇవ్వనుంది.

జమ్నీ ధరను జూన్ 5న ప్రకటిస్తామని మారుతీ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఇది వరకే వెల్లడించారు. జనవరి 12 నుంచి ఈ కార్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ జరిగాయి. మారుతి 2024 ఆర్థిక సంవత్సరంలో 4,75,000 యూనిట్లను అమ్మాలని.. ఎస్ యూ వీ మార్కెట్ లో 25 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 4 వీల్ డ్రైవ్ తో రాబోతోంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల(ఎక్స్-షోరూం) మధ్య ఉంటుందని అంచనా.

Read Also: Odisha Train Accident: ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ

పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతోన్న జిమ్నీ 105 పీఎస్ శక్తిని 135 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో జిమ్నీ రాబోతోంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌ ఓఆర్వీఎంలు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్ షెల్ బానెట్, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీర్ వంటి ఫీచర్లు ఉణ్నాయి. 9 ఇంచ్ హెచ్డీ డిస్ ప్లేతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిట్ ఆటో కనెక్టివిటీ, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక సెఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగులు, బ్రెక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హెల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ ఉన్నాయి.

Show comments