ఈ రోజుల్లో కారు కొనుక్కోవడం అనేది ప్రతి సామాన్యుడి కల. ఓ ప్రణాళిక ప్రకారం కారు కోసం డబ్బు కూడబెట్టుకొని మరీ కొనుగోలు చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. మరీ ముఖ్యంగా తమ తమ బడ్జెట్ రేంజ్ లోనే కారు కొనేవారు ఎక్కువవుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు మారుతి స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే తక్కువ ధరలకు కార్లు విక్రయిస్తున్న సంస్థగా మారుతీకి పేరుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ కార్లను కొంటుంటారు.
READ MORE: Harassment: విమానంలో మహిళని లైంగికంగా వేధించిన జిందాల్ ఉద్యోగి.. స్పందించిన నవీన్ జిందాల్..
తాజాగా మారుతీ సుజుకీ ఈవీక్స్ (ఎలక్ట్రిక్) కారును ఇప్పటికే అనేక ఆటో షోలలో చాలా సార్లు ప్రదర్శించారు. ఇది ఈ సంస్థ తొలి ఎలక్ట్రిక్ వాహనం కావడంతో భారీగా అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో సామాన్యుల ఆదరణ పొందిన మారుతి సుజుకీ.. ఈ కారు రాకతో సంచలనం సృష్టిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కొత్త కారుకు ఎస్కుడో అని పేరు పెట్టవచ్చని జపనీస్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ అయిన హటేనా బ్లాగ్ తెలిపింది. మారుతీ సుజకీ కొత్త కారుకు సంబంధించి అనేక నివేదికలు బయటకు వచ్చాయి. ఈ కారులో విభిన్న అవసరాలను తీర్చడానికి రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లను అమర్చారు. ఒకటి 40 కేడబ్ల్యూహెచ్, రెండోది 60 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. వాటిలో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం మన దేశంలో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునే వారికి 60 కేడబ్ల్యూహెచ్ వీలుగా ఉంటుంది.
READ MORE: World Kamma Mahasabhalu: ఈ నెల 20, 21 తేదీల్లో ప్రపంచ కమ్మ మహాసభలు
మొదటగా సుజుకి ఎస్కుడో (మారుతీ సుజుకీ ఈవీక్స్)తో రానుంది. అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాటరీ, అభివృద్ధి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. కొత్త సుజుకి ఎస్కుడో డిజైన్ చాలా ఆకట్టుకుంటోంది. బయట డిజైన్ లో కొత్త ట్రై ఏరో ఎల్ఈడీ డీఆర్ ఎల్, స్లీక్ హెడ్ లైట్లు, అప్ డేటెడ్ ఓఆర్వీఎమ్, స్పోర్ట్ బంపర్ ఏర్పాటు చేశారు. సైడ్ ప్రొఫల్ లో ప్రోమినెంట్ వీల్ ఆర్చ్, అల్లాయ్ వీల్స్, ఫ్లస్ టైప్ డోర్ హ్యాండిల్ అమర్చారు. సుజుకి ఎస్కుడో మన దేశంతో పాటు యూరోప్, జపాన్లలో అందుబాటులో ఉంటుంది. 2025 జనవరి లో మన మార్కెట్ కు వచ్చే అవకాశం ఉంది.