మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
READ MORE: Shivraj Singh: ఎయిరిండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిపోయిన సీటులో ప్రయాణం
వాస్తవానికి.. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో వచ్చింది. సియాజ్ ప్రారంభంచినప్పుడు విజయాన్ని సాధించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాతో పోటీ పడుతూ వచ్చింది. మంచి మైలేజ్‌తో దూసుకు పోయింది. కానీ.. ఇటీవల అమ్మకాలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. 2020లో కంపెనీ తన డీజిల్ వేరియంట్‌ను నిలిపివేయడంతో సియాజ్ అమ్మకాలు పెద్ద దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సియాజ్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది గణాంకాలు గమనిస్తే.. అక్టోబర్ 2024లో మారుతి సియాజ్ మొత్తం 659 మంది కొత్త కస్టమర్లను పొందింది. అయితే నవంబర్ 2024లో మొత్తం 597 మంది మారుతి సియాజ్‌ను కొనుగోలు చేశారు. డిసెంబర్ 2024లో 464 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2025 జనవరిలో 768 మంది కస్టమర్లకు మాత్రమే విక్రయించారు. మరోవైపు.. కంపెనీ చివరి సారిగా 2018 సంవత్సరంలో సియాజ్ వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మళ్లీ ఇంత వరకూ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాలేదు. కాగా.. సియాజ్ ధర రూ. 9.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్‌కు రూ. 12.29 లక్షల వరకు ఉంటుంది.
READ MORE: Bhatti Vikramarka : ఫైనల్‌గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది