NTV Telugu Site icon

Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

Grand Vitara

Grand Vitara

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రముఖ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadi కథనం ప్రకారం.. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ కారు భారత మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్‌యూవీ ‘గ్రాండ్ విటారా’.. గట్టి పోటీ ఇస్తుందని నిపుణుల అభిప్రాయం.

READ MORE: BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?

డిజైన్ ఇలా ఉండవచ్చు..
స్పాటెడ్ 7-సీటర్ విటారా కారు ముందు భాగంలో కొత్త LED DRL, హెడ్‌ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ యూనిట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బంపర్ కూడా కొత్త ఎయిర్ టెక్‌తో రీడిజైన్ చేయనున్నారు. కారు బూట్ గేట్, వెనుక బంపర్ కూడా మారుస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ అమర్చనున్నారు. మరోవైపు క్యాబిన్ కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. 7-సీటర్ గ్రాండ్ విటారాలోనూ ప్రస్తుత గ్రాండ్ విటారా మోడల్ కారులో వాడుతున్న ఇంజిన్‌నే వాడతారని తెలుస్తున్నది. మైల్డ్ హైబ్రీడ్ సెటప్‌తోపాటు 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్ 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. నాన్ -హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇస్తారని తెలుస్తున్నది. మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

READ MORE: Maruti Suzuki Celerio: మారుతి సెలెరియో న్యూ ఎడిషన్ విడుదల.. కేవలం రూ. 4.99 లక్షలకే

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లార్జ్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంస్, సెకండ్ రోలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. మారుతి ఇన్‌విక్టో లో మాదిరిగా 7-సీటర్ గ్రాండ్ విటారా కారులో 6- ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరా వ్యూ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (వీఎస్‌సీ) తదితర ఫీచర్లు ఉండనున్నాయి. ఈ 7-సీటర్ గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షలు దాటవచ్చని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

Show comments