Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి
- త్వరలో విడుదల కానున్న ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్
- వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రముఖ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 7-సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది అంటే 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadi కథనం ప్రకారం.. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ కారు భారత మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్‌యూవీ ‘గ్రాండ్ విటారా’.. గట్టి పోటీ ఇస్తుందని నిపుణుల అభిప్రాయం.
READ MORE: BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?
Also Read
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
డిజైన్ ఇలా ఉండవచ్చు..
స్పాటెడ్ 7-సీటర్ విటారా కారు ముందు భాగంలో కొత్త LED DRL, హెడ్‌ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ యూనిట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బంపర్ కూడా కొత్త ఎయిర్ టెక్‌తో రీడిజైన్ చేయనున్నారు. కారు బూట్ గేట్, వెనుక బంపర్ కూడా మారుస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ అమర్చనున్నారు. మరోవైపు క్యాబిన్ కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. 7-సీటర్ గ్రాండ్ విటారాలోనూ ప్రస్తుత గ్రాండ్ విటారా మోడల్ కారులో వాడుతున్న ఇంజిన్‌నే వాడతారని తెలుస్తున్నది. మైల్డ్ హైబ్రీడ్ సెటప్‌తోపాటు 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్ 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. నాన్ -హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇస్తారని తెలుస్తున్నది. మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది.
READ MORE: Maruti Suzuki Celerio: మారుతి సెలెరియో న్యూ ఎడిషన్ విడుదల.. కేవలం రూ. 4.99 లక్షలకే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లార్జ్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంస్, సెకండ్ రోలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. మారుతి ఇన్‌విక్టో లో మాదిరిగా 7-సీటర్ గ్రాండ్ విటారా కారులో 6- ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరా వ్యూ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (వీఎస్‌సీ) తదితర ఫీచర్లు ఉండనున్నాయి. ఈ 7-సీటర్ గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షలు దాటవచ్చని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!