NTV Telugu Site icon

Maruti Suzuki Celerio: మారుతి సెలెరియో న్యూ ఎడిషన్ విడుదల.. కేవలం రూ. 4.99 లక్షలకే

Maruti Suzuki Celerio

Maruti Suzuki Celerio

మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.

READ MORE: Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..

ఈ పరిమిత ఎడిషన్ ఈ ఏడాది చివర్లో మంచి వినియోగదారులకు మంచి ఎంపికగా మారనుంది. ఇందులో అనేక ఉచిత యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన సైడ్ మోల్డింగ్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్-కలర్ డోర్ సిల్ గార్డ్‌లు, ఫ్యాన్సీ ఫ్లోర్ మ్యాట్‌లు అమర్చారు. లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 6bhp పవర్, 89nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇంతే కాకుండా CNG వేరియంట్‌లో ఈ ఇంజన్ 56bhp శక్తిని మరియు 82.1nm యొక్క టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడుతుంది.

READ MORE: Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..

పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ తో లీటరుకు 25.24 కిలోమీటర్లు, పెట్రోల్-ఏఎమ్ టీ ఆప్షన్ తో లీటరుకు 26.68 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అదనంగా, సెలెరియో సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతే కాకుండా.. ఇందులో వేరియంట్లు స్మార్ట్ ఫోన్ నావిగేషన్ సామర్థ్యాలను కలిగి ఉన్న 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తాయి. ఈ సిస్టమ్ ఆపిల్ (apple) కార్ ప్లే, ఆండ్రాయిడ్ (android) ఆటో రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. అదనంగా, ఈ హ్యాచ్ బ్యాక్ లో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ మెకానిజం తదితర ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్పి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Show comments