Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Car Price Hike: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి కార్ల మోడళ్ల ధరలను పెంచింది. నవంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇన్విక్టోపై అత్యధికంగా రూ.25,000 వరకు పెంపు ఉండగా.. స్విఫ్ట్, డిజైర్, బాలెనో, జిమ్నీ, విక్టోరిస్ వంటి మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ పెంపులో భాగంగా ఇన్విక్టో ధర గరిష్ఠంగా రూ.25,000 పెరిగింది. డిజైర్, విక్టోరిస్, స్విఫ్ట్, జిమ్నీ, బాలెనో మోడళ్లపై రూ.10,000 వరకు పెంపు విధించారు. బ్రెజా, టూర్ ఎస్, ఎర్టిగా, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్ ధరలు రూ.5,000 వరకు పెరిగాయి. ఈకో ధర గరిష్ఠంగా రూ.2,500 పెరిగింది. ఈ ధరల పెంపు వేరియంట్లను బట్టి మారుతుంది.
ఇందులో భాగంగా స్విఫ్ట్ VXi CNG AGS ధర రూ.10,000 పెరిగి రూ.8,02,400కు చేరింది. బాలెనో Delta CNG AGS ధర కూడా రూ.10,000 పెరిగి రూ.8,42,400గా ఉంది. ధరల పెంపు తర్వాత ఇన్విక్టో ప్రారంభ ధర రూ.25.27 లక్షలుగా ఉంది. డిజైర్ రూ.6.33 లక్షలు, విక్టోరిస్ రూ.10.60 లక్షలు, స్విఫ్ట్ రూ.5.84 లక్షలు, జిమ్నీ రూ.12.69 లక్షలు, బాలెనో రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక బ్రెజా రూ.7.55 లక్షలు, ఎర్టిగా రూ.8.95 లక్షలు, ఎస్-ప్రెస్సో రూ.3.50 లక్షలు, వ్యాగన్ ఆర్ రూ.4.99 లక్షలు, ఎక్స్ఎల్6 రూ.11.67 లక్షలు, ఫ్రాంక్స్ రూ.6.95 లక్షలు, ఈకో రూ.5.31 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
Also Read
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
- Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
- Toyota Innova Hycross Facelift: భారత్‌లో కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్.. ధర, ఫీచర్లు, E85 హైబ్రిడ్ ప్రత్యేకతలు ఇవే!
- Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు ఖర్చుల నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, అవి సరిపోవడం లేదని మారుతి సుజుకి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో పెరిగిన ఖర్చుల్లో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోందని తెలిపింది. 2026లో మారుతి సుజుకి ధరలు పెంచడం ఇది నాలుగోసారి. గతంలో జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ ధరలను సవరించింది. మరోవైపు టాటా మోటార్స్, హ్యుందాయ్ సంస్థలు డిసెంబర్ నుంచి కార్ల ధరలను పెంచనున్నాయి.
తాజావార్తలు
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
-
Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
-
India Playing 11: కొత్త ఆటగాడికి ఛాన్స్?.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సిరా వివాదం.. బ్యాలెట్ బాక్సుల వద్ద కలకలం
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!