NTV Telugu Site icon

Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!

Maruti Brezza

Maruti Brezza

Purchase Maruti Suzuki Vitara Brezza Just Rs 5 Lakh in Cars 24: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మారుతి సుజికీ బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. కొత్త బ్రెజాకే కాకుండా సెకండ్ హ్యాండ్ బ్రెజాకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు పాత బ్రెజాని కొనుగోలు చేయాలనుకుంటే.. కార్స్ 24 వెబ్‌సైట్‌లో చాలా కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధర దాదాపు రూ.5 లక్షలుగా ఉన్నాయి. అయితే మీరు ఈ కారును కొనుగోలు చేసేటప్పుడు.. కండీషన్, సర్వీస్ హిస్టరీ మరియు డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి.

Maruti Vitara Brezza VDI (O) MANUAL:
2017 మారుతి విటారా బ్రెజా వీడీఐ (ఓ) మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 4.96గా ఉంది. హర్యానా రిజిస్ట్రేషన్‌ గల ఈ కారు డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు మొత్తం 93,090 కిమీ తిరిగింది. ఇది ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Also Read: MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?

Maruti Vitara Brezza VDI MANUAL:
2016 మారుతి విటారా బ్రెజా వీడీఐ మాన్యువల్ రూ. 4.88 లక్షలకు అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉంది. మొదటి యజమాని వద్ద గల ఈ కారు రీడింగ్ 42,216 కిలోమీటర్లు. ఢిల్లీలో విక్రయానికి ఈ కారు అందుబాటులో ఉంది.

2018 Maruti Vitara Brezza LDI (O):
2018 మారుతి విటారా బ్రెజా వీడీఐ (ఓ) కారు.. కార్స్ 24 వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ధర రూ. 5.49 లక్షలు. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మొదటి యజమాని వద్ద ఉంది. 36,747 కిలోమీటర్లు రీడింగ్ గల ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది.

2018 Maruti Vitara Brezza ZDI AMT AUTOMATIC:
2018 మారుతి విటారా బ్రెజా జెడ్‌డీఐ ఏఎంటీ ఆటోమేటిక్ కారు ధర రూ.6.85 లక్షలుగా ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారులో డీజిల్ ఇంజన్ కలదు. ఈ కారు రీడింగ్ 69,862 కిమీ కాగా.. మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Also Read: Tilak Varma Team India: నిద్రలో కూడా దాని గురించే ఆలోచిస్తా.. హైదరాబాద్ క్రికెటర్ తిలక్‌ వర్మ!

Show comments