Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Alto K10పై ఆగస్టు నెలకు సంబంధించి కొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. రాఖీ పండుగ (రక్షా బంధన్) సందర్భంగా ఈ నెలలో కస్టమర్లకు గరిష్టంగా రూ.71,960 వరకు ప్రయోజనం లభించనుంది. ఇందులో ఎక్కువ డిస్కౌంట్ ఆటోమేటిక్ (AGS) వెర్షన్ కు వర్తిస్తుంది. గత జూలైలో ఈ డిస్కౌంట్ రూ. 67,100 మాత్రమే ఉండగా ఈసారి మరింత పెంచారు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్ తోపాటు ఉచిత యాక్సెసరీ కిట్ కూడా ఉంది.
ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఆల్టో K10పై ప్రత్యేక రాయితీలు అందుబాటులోకి వచ్చాయి.ఇందులో రూ.31,500 క్యాష్ డిస్కౌంట్, రూ.10,460 విలువైన ఉచిత యాక్సెసరీ కిట్, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.25,000 వరకు స్క్రాప్ బోనస్, అలాగే కొంతమంది ప్రత్యేక కొనుగోలుదారులకు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ ఆఫర్లు కలిపి వినియోగదారులకు భారీ మొత్తంలో ఆదా చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే, రాయితీ ధరలు ప్రాంతం, డీలర్‌షిప్ ఆధారంగా మారవచ్చు. ఈ ఆల్టో K10 భారత మార్కెట్లో 4.23 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అత్యంత సరసమైన, ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా కొనసాగుతోంది.
మారుతి ఆల్టో K10, Heartect ప్లాట్‌ఫాంపై రూపొందించబడింది. అలాగే 1.0-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 66.62 PS పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 24.90 కి.మీ., మాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.39 కిలోమీటర్లు అందిస్తుంది. ఇంధన పొదుపు కోరుకునే వారికి ప్రత్యేకంగా CNG వెర్షన్ కూడా ఉంది. ఇది కిలోకు 33.85 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తుంది.
ఈ Alto K10లో 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, USB, బ్లూటూత్, AUX వంటి కనెక్టివిటీ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో సౌకర్యం కోసం స్టీరింగ్ వీల్‌లోనే మ్యూజిక్, కాల్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో Alto K10లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటితోపాటు ABS with EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ప్రీ-టెన్షనర్ సీటుబెల్ట్స్, హై-స్పీడ్ వార్నింగ్ ఇంకా స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్, సిజిలింగ్ రెడ్, సిల్కీ వైట్, సాలిడ్ వైట్, గ్రానైట్ గ్రే వంటి రంగుల ఎంపికలో ఆకర్షణీయమైన ఆప్షన్లు అందిస్తుంది.
