భారత మార్కెట్లో మహీంద్రా కొత్తగా ప్రవేశపెట్టిన XUV 7XO SUV ఇప్పుడు అధికారికంగా డెలివరీ దశలోకి ప్రవేశించింది. ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ 7-సీటర్ SUV టెక్-సావీ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇటీవలే మహీంద్రా XUV 7XO కోసం బుకింగ్‌లను ప్రారంభించగా, దీని ప్రారంభ ధర రూ.13.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం డెలివరీలు ప్రధానంగా AX7, AX7T మరియు AX7L వంటి టాప్ వేరియంట్లకే పరిమితమయ్యాయి. అయితే ఈ SUV AX, AX3, AX5 వేరియంట్లలో కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.
మహీంద్రా XUV 7XO: ఇంజిన్ & ట్రాన్స్మిషన్
XUV 7XOలో XUV700లో ఉపయోగించిన అదే పవర్‌ట్రెయిన్ కొనసాగుతోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ – 203 hp పవర్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ – 185 hp పవర్.. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తాయి. దీని వల్ల నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
మహీంద్రా XUV 7XO: వెలుపలి డిజైన్ విషయానికి వస్తే.. కొత్త XUV 7XO మరింత స్పోర్టీ మరియు దూకుడైన లుక్‌తో వస్తుంది. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, బోల్డ్ ఆకారంలో ఉన్న LED DRLs ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదనంగా, 19 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బంపర్లు, అప్డేటెడ్ టెయిల్‌ల్యాంప్స్.. వెనుక భాగంలో ప్రత్యేకమైన షట్కోణ ఆకృతితో ఉన్న టెయిల్ లైట్లు ఆధునిక లుక్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్ మాత్రం గత XUV700ను పోలి ఉండగా, కొత్త వీల్ డిజైన్ ప్రధాన మార్పుగా కనిపిస్తుంది.
మహీంద్రా XUV 7XO: ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్లోకి అడుగుపెట్టగానే ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. డ్యూయల్-టోన్ బ్రౌన్ మరియు లైట్ బేజ్ కలర్ స్కీమ్‌తో కొత్త ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డ్‌పై మూడు 12.3 అంగుళాల స్క్రీన్లతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది డ్రైవర్‌కు పూర్తిగా డిజిటల్, ఫ్యూచరిస్టిక్ అనుభూతిని అందిస్తుంది.
మహీంద్రా XUV 7XO ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ SUVలో మహీంద్రా అనేక ఆధునిక ఫీచర్లను అందించింది.. అందులో ముఖ్యమైనవి.. 540 డిగ్రీల కెమెరా సిస్టమ్, ముందు రెండు వరుసలకు వెంటిలేటెడ్ సీట్లు, టచ్-సెన్సిటివ్ క్లైమేట్ & ఆడియో కంట్రోల్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో 16-స్పీకర్ హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్.. వైర్లెస్ ఛార్జింగ్.. భారత రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా కేలిబ్రేట్ చేసిన లెవల్ 2 ADAS.. మొత్తంగా పవర్ఫుల్ ఇంజిన్లు, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్, అధునాతన సేఫ్టీ మరియు టెక్ ఫీచర్లతో మహీంద్రా XUV 7XO ప్రీమియం 7-సీటర్ SUV సెగ్మెంట్లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది.