Mahindra XUV 3XO: ఎన్నో రోజుల నుంచి కస్టమర్లను ఊరిస్తున్న మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా XUV 3XO ఈ రోజు లాంచ్ అయింది. గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ లుక్స్‌తో, మరిన్ని టెక్ ఫీచర్లతో ఈ కార్ వచ్చింది. తొలిసారిగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS ఫీచర్లని అందిస్తోంది. టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్‌లకు మహీంద్రా XUV 3XO ప్రత్యర్థిగా ఉండబోతోంది. మొత్తం 5 వేరియంట్లలో ఈ కార్ లభ్యమవుతోంది.
పూర్తిగా ఇంటీరియర్, ఎక్స్‌టీయర్లలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. C-ఆకారపు LED DRLలు, హెడ్ ల్యాంప్ కస్టర్ స్టన్నింగ్ లుక్స్‌ని అందిస్తున్నాయి. వెనకవైపు C-షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంది. 10.25 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు డ్యాష్ బోర్డు పూర్తిగా రీడిజైన్ చేయబడింది. 3-స్పోక్ స్టీరింగ్ వీట్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయర్ జోన్ ఆటోక్లైమెట్ కంట్రోల్ , వైర్ లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లతో లెవల్ 2 ADASని కలిగి ఉంది. హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి మొత్తం 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
Read Also: Vijaysai Reddy: జగన్ ను తొలగించాలని చంద్రబాబు కుట్ర
ఇంజన్ ఆఫ్షన్స్:
మహీంద్రా XUV 3XO మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో 109 BHP పవర్, 200 Nm టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 129 BHP, 230 Nm లను ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ‘mStallion’ ఇంజన్లతో పాటు 1.5 లీటర్ టర్బో డిజిల్ ఇంజన్ కలిగి ఉంటుంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్లను కలిగి ఉంది.
మహీంద్రా XUV 3XO ఎక్స్-షోరూమ్ ధరలు: