NTV Telugu Site icon

ICOTY: ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సొంతం చేసుకున్న కార్ ఇదే..

Thar Roxx

Thar Roxx

ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డు ప్రకటించారు. ఈ నామినేషన్‌లో మారుతీ డిజైర్, మారుతీ స్విఫ్ట్, మహీంద్రా థార్ రాక్స్, ఎమ్‌జీ విండ్సర్ ఈవీ, సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్, కర్వ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, BYD eMAX 7 పాల్గొన్నాయి. అయితే.. ఓ కారు మాత్రం వీటిన్నింటినీ అధిగమించించి ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఆ కారు ఏదో అనుకుంటున్నారా? అదే ఇటీవల మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించిన మహీంద్రా థార్ రాక్స్. మహీంద్రా థార్ రాక్స్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డును గెలుచుకుంది.

READ MORE: Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!

దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా థార్‌ రాక్స్‌ ను మార్కెట్లోకి ఈ ఏడాది తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 డోర్‌ మహీంద్రా థార్‌ రాక్స్‌ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున లాంచ్‌ చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు ఆప్షన్లలో దీన్ని విడుదల చేసింది. కాగా.. అక్టోబర్‌ 3 నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్స్‌లో ఈ కార్ కొత్త రికార్డు సృష్టించింది. గంటలోపే లక్షన్నరకు పైగా బుకింగులు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.

READ MORE: Hisaab Barabar: ఆసక్తి రేపుతున్న ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్

పెట్రోల్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ.12.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఇక డీజిల్‌ వెర్షన్‌ రూ.13.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్‌) నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది. కేవలం 60 నిమిషాల్లోనే 1,76,218 థార్ రాక్స్ ఎస్‌యూవీలను ఆర్డర్ చేశారు. దీంతో మహీంద్రా ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Show comments